ETV Bharat / headlines

హైదరాబాద్‌ విద్యార్థినికి రూ.2 కోట్ల కొలువు

author img

By

Published : May 16, 2021, 7:14 PM IST

హైదరాబాద్​కు చెందిన ఓ విద్యార్థినికి అమెరికాలో రెండు కోట్ల వార్షిక వేతనంతో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా ఉద్యోగం లభించింది. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో తెలుగు తేజానికే అత్యధిక వేతనం లభించడం హర్షణీయం

good job with high package to telugu student
good job with high package to telugu student

తెలంగాణలోని హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినికి అమెరికాలోని సియాటెల్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్​వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం లభించింది. వార్షిక వేతనం రూ.2 కోట్లు. యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలో ఈనెల 2న ఎంఎస్‌(కంప్యూటర్స్‌) పూర్తి చేసిన దీప్తి క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈనెల 17న దీప్తి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించింది.

ఆమె తండ్రి డాక్టర్‌ వెంకన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో క్లూస్‌టీం విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. బీటెక్‌ తర్వాత దీప్తి... జేపీ మోర్గాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా మూడేళ్లు ఉద్యోగం చేశారు. తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు.

ఇవీ చదవండి:

రఘురామ కేసు: జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వైద్య బృందం నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.