ETV Bharat / entertainment

మోక్షజ్ఞ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ ప్లాన్ సూపర్​​.. ఆ మాస్​ దర్శకుడితోనే!

author img

By

Published : May 1, 2023, 5:18 PM IST

Updated : May 1, 2023, 5:48 PM IST

Mokshagna Entry: నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు..

Mokshagna entry with balakrishna boyapati new movie
మోక్షజ్ఞ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ ప్లాన్ సూపర్​​.. ఆ మాస్​ దర్శకుడితోనే!

Mokshagna movie: నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న తెలిసిందే. మూడు దశాబ్దాల నుంచి అగ్రకథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోలు జోరు కొనసాగుతున్నా వారికి దీటుగా బాలయ్య విజయాలను అందుకుంటున్నారు. అయితే ఆయన నటవారసత్వాన్ని కొనసాగించే నందమూరి మోక్షజ్ఞ తేజను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆయన అభిమానులతో పాటు, ప్రేక్షకులూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నందమూరి వారసుడిని ఏ దర్శకుడు లాంఛ్‌ చేస్తారా అని ఆసక్తిగా చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీపై ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా మరో అదిరిపోయే బ్లాస్టింగ్​ వార్త ఒకటి బయటకు వచ్చింది.

మాస్‌ సినిమాల కేరాఫ్ అడ్రెస్​గా మారిన దర్శకుడు బోయపాటి శ్రీను.. మోక్షజ్ఞను బిగ్‌స్క్రీన్‌కు పరిచయం చేయనున్నారని ప్రస్తుతం నెట్టింట వార్తలు జోరుగా వస్తున్నాయి. బోయపాటి ప్రస్తుతం రామ్‌ పోతినేనితో కలిసి ఓ భారీ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బాలకృష్ణతో చేయనున్నారని తెలిసింది. అందులోనే మోక్షజ్ఞ కనిపించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఆ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో మోక్షజ్ఞ మెరవనున్నారట. అతిథి పాత్రలో కనిపించినప్పటికీ.. అది సినిమాకే హైలైట్​గా నిలవనుందట. ఆఫీషియల్‌గా కన్ఫామ్‌ చేయనప్పటికీ ఈ వార్త నిజమేనని చిత్రసీమ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ అక్టోబర్‌లో సెట్స్‌ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇక ఈ వార్త తెలియడంతో.. నందమూరి కుటుంబం నుంచి మరో కథానాయకుడిని తెరపై చూడొచ్చని అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్​లో హాట్‌ టాపిక్‌గా మారింది

ఇక గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మోక్షజ్ఞ సినిమాల్లోకి కచ్చితంగా వస్తారని చెప్పిన విషయం తెలిసిందే. మోక్షజ్ఞపై తనకు చాలా ఆశలున్నాయని.. తాను దర్శకత్వం వహించే 'ఆదిత్య-369' సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చని కూడా చెప్పారు. కానీ దానిపై తర్వాత ఎటువంటి వార్తలు రాలేదు. అప్పటి నుంచి మోక్షజ్ఞ ఏ సినిమాలో కనిపిస్తారా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తునే ఉన్నారు. ఇప్పుడు ఒకే స్క్రీన్‌పై బాలకృష్ణ, మోక్షజ్ఞ కనిపించనున్నారని ప్రచారం సాగడంతో ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్‌ అవుతున్నారు.

ఇక బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా విషయానికొస్తే.. ఆయన ఫన్ డైరెక్టర్​ అనిల్​ రావిపూడితో కలిసి NBK 108 చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్​తో ఈ చిత్రం తెరకెక్కుతోందని అంతా అంటున్నారు. ఓ శక్తిమంతమైన కథతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ శైలి మాస్‌ యాక్షన్‌తో పాటు అనిల్‌ రావిపూడి మార్క్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.

ఇదీ చూడండి: ఏం టాలెంట్​​ భయ్యా.. ఇండస్ట్రీలో ఇప్పుడీ ముద్దుగుమ్మే హాట్​టాపిక్​!

Last Updated : May 1, 2023, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.