ETV Bharat / entertainment

'హనుమాన్'​ కలెక్షన్స్​ - రెండో రోజు భారీగా జంప్​ - ఏకంగా ఎన్ని కోట్లంటే?

Hanuman Movie Day 2 WorldWide collections : 'హనుమాన్' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకోవడం ప్రారంభించింది. తొలి రోజు కన్నా రెండో రోజు వసూళ్లు అధికంగా వచ్చాయి. ఎన్ని కోట్లంటే?

'హనుమాన్'​ కలెక్షన్స్​ - రెండో రోజు భారీగా జంప్​ - ఎన్ని కోట్లంటే?
'హనుమాన్'​ కలెక్షన్స్​ - రెండో రోజు భారీగా జంప్​ - ఎన్ని కోట్లంటే?

Published : January 14, 2024 at 10:45 AM IST

|

Updated : January 14, 2024 at 11:18 AM IST

Choose ETV Bharat

Hanuman Movie Day 2 WorldWide collections : సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న సూపర్ హీరో మూవీ 'హనుమాన్' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకోవడం ప్రారంభించేసింది. యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రెండో రోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో జోరు చూపించింది. 55.65% పెరుగుదల కనబరిచింది! శనివారం(జనవరి 13) రూ. 12.53 కోట్ల వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో తెలుగు వెర్షన్ నుంచి రూ. 8.4 కోట్లు, హిందీ వెర్షన్ నుంచి రూ. 4.13 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఇక ఇండియావైడ్​గా రూ. 14.05 కోట్ల గ్రాస్​, ఓవర్సీస్​లో రూ. 9.45 కోట్ల గ్రాస్​తో మొత్తంగా వరల్డ్ వైడ్​గా రూ.23.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ఈ హనుమాన్ చిత్రం విడుదలకు ముందే ఇండియా వైడ్​గా మంచి హైప్​ను అందుకుంది. గురువారం(జనవరి 11) వేసిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్​ రూ. 4.15 కోట్లు వచ్చింది. విడుదలైన రోజు రూ. 8.05 కోట్లు సాధించిందట. అందులో తెలుగు వెర్షన్ నుంచి రూ. 5.89 కోట్లు రాగా, హిందీ వెర్షన్ రూ.2.1 కోట్లు వచ్చిందని తెలిసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.10కోట్లకు పైగా అందుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

కాగా, ఈ సినిమా రివ్యూ గురించి సింపుల్​గా చెప్పాలంటే - కథా నేపథ్యం, తేజ సజ్జా నటన, గ్రాఫిక్స్‌ హంగులు, నేపథ్య సంగీతం సినిమాకు బలాలుగా నిలిచాయి. అయితే అక్కడక్కడా నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా డివైనిటీ, ఎమోషన్స్, లవ్, కామెడీ తదితర అంశాలతో తెరకెక్కింది. సినిమాలో తేజ సజ్జా ఓ సామాన్య కుర్రాడిలా, అలాగే సూపర్‌ పవర్స్‌ వచ్చాక అటు యాక్షన్‌లోనూ, ఇటు ఎమోషన్స్​ సీన్స్​లోనూ అద్భుతంగా నటించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రివ్యూ : కింగ్ ఈజ్ బ్యాక్​ - 'నా సామి రంగ' నాగ్ ర్యాంప్ ఆడిస్తున్నాడు!

Last Updated : January 14, 2024 at 11:18 AM IST