ETV Bharat / entertainment

హీరోయిన్​ సమంతకు అస్వస్థత.. మళ్లీ ఏమైంది?

author img

By

Published : Apr 12, 2023, 5:25 PM IST

Updated : Apr 12, 2023, 5:33 PM IST

మయోసైటిస్‌ నుంచి కోలుకుంటున్న హీరోయిన్​ సమంత అనారోగ్యానికి గురయ్యారు. ఏమైంది?

actress samantha suffers with fever
actress samantha suffers with fever

టాలీవుడ్​ స్టార్​ నటి సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వరుస షూటింగ్స్‌, ప్రమోషన్స్‌తో గత కొన్నిరోజుల నుంచి ఫుల్‌ బిజీగా ఉన్న సామ్​.. జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం జరగనున్న శాకుంతలం ప్రమోషనల్‌ కార్యక్రమంలో పాల్గొనడం లేదని వెల్లడించారు.

"ఈ వారం అంతా మీ మధ్య ఉండి.. మా చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తూ ప్రేమాభిమానాలను పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. వరుస ప్రమోషన్స్‌, షూటింగ్‌ షెడ్యూల్స్‌ వల్ల దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురయ్యాను. జ్వరం, గొంతునొప్పితో ఇబ్బందిపడుతున్నా. ఈ రోజు సాయంత్రం ఎంఎల్‌ఆర్‌ఐటీలో జరగనున్న వార్షికోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నా. మా టీమ్‌తో కలిసి మీరూ పాల్గొనండి. మీ అందర్నీ నేను మిస్‌ అవుతున్నా" అని సమంత ట్వీట్​ చేశారు.

యశోద సినిమా తర్వాత సమంత నటించిన లేటెస్ట్​ మూవీ శాకుంతలం. ఈ మూవీలో సామ్​.. లీగ్​ రోల్​ శకుంతలగా నటించారు. మలయాళ నటుడు దేవ్​ మోహన్​.. దుష్యంతుడి పాత్ర పోషించారు. భారీ బడ్జెట్​తో పాటు ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్​ 14న రిలీజ్​ కానుంది. అయితే మయోసైటిస్‌ అనే వ్యాధికి గురైన సమంత గత కొన్ని నెలల నుంచి సినిమా షూటింగ్స్‌ అన్నింటికీ దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న సామ్​.. ఓ వైపు శాకుంతలం ప్రమోషన్స్‌.. మరోవైపు సిటాడెల్‌, ఖుషి షూట్స్‌లో పాల్గొంటున్నారు.

తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్​.. పలు విషయాలను వెల్లడించారు. తన వైవాహిక బంధానికి స్వస్తి పలికిన నాటి రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు. వాటన్నింటిని తన జీవితంలోని చీకటి క్షణాలుగా పేర్కొన్నారు. ఆ బాధ నుంచి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదంటూ వ్యాఖ్యానించారు. ఇక సోషల్ మీడియాలో ఆమెపై వచ్చిన ట్రోల్స్​ను కూడా ఎలా ఎదుర్కొంటున్నారో తెలిపారు. ఇక తనకు ఆ సమయంలో సపోర్ట్​గా ఉన్నా వారందరికి ధన్యవాదాలు తెలిపారు. "ఆ సమయంలో నేను.. నా మనసుకు నచ్చినట్లు రియాక్ట్‌ అయ్యానంతే. అప్పుడు నాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలుస్వతంత్ర భావాలు కలిగిన బలమైన మహిళగా మీరందరూ నన్ను అభివర్ణించవచ్చు. కానీ, నన్ను నేను అలా అనుకోవడం లేదు. నేనూ ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలనూ చూశా. కుటుంబసభ్యులు, స్నేహితులు నా వెంటే ఉన్నారు. వాళ్ల వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అయితే, ఆ బాధ నుంచి నేనింకా పూర్తిగా కోలుకోలేదు" అంటూ చెప్పుకొచ్చారు.

Last Updated : Apr 12, 2023, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.