ETV Bharat / crime

తెలంగాణలో తండ్రి ఎదుటే కూతురు కిడ్నాప్​.. వీడియో వైరల్​

author img

By

Published : Dec 20, 2022, 11:32 AM IST

Young Woman Kidnap in Sircilla
Young Woman Kidnap in Sircilla

Young Woman Kidnap in Sircilla: తెలంగాణలో యువతి కిడ్నాప్​ కలకలం రేపింది. తెల్లవారుజామున కారులో వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యువతి తండ్రిని పక్కకు నెట్టి ఆమెను తీసుకెెళ్లారు.

Young Woman Kidnap in Sircilla: తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. తెల్లవారుజామున కారులో వచ్చిన కొందరు వ్యక్తులు.. తండ్రిని తోసేసి యువతిని తీసుకెళ్లారు. మూడపల్లి గ్రామానికి చెందిన గోలి శాలిని ఇంటి వద్దకు తెల్లవారుజామున షిఫ్ట్‌కారులో ముఖాలకు మాస్కులు వేసుకుని కొందరు వ్యక్తులు వచ్చారు. బయటికి వచ్చిన శాలినిని పట్టుకుని కారులో ఎక్కిస్తుండగా.. గమనించిన ఆమె తండ్రి అడ్డుకోబోయాడు. తండ్రిని తోసేసి శాలినిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. అదే గ్రామానికి చెందిన కటుకూరి జాన్‌పై యువతి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది క్రితం జాన్‌-శాలిని పారిపోయినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. మైనర్‌ అయిన తమ అమ్మాయిని జాన్‌ కిడ్నాప్‌ చేశాడని అప్పట్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని తీసుకువచ్చి.... విడిపించగా ఏడాది నుంచి వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల శాలినికి మైనార్టీ తీరటంతో నిశ్చితార్థం చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యువతిని అపహరించటంతో జాన్‌పైనే కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వద్ద నుంచి తీసుకువెళ్తుండగా అక్కడి సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాలు, కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు

తెలంగాణలో తండ్రి ఎదుటే కూతురు కిడ్నాప్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.