ETV Bharat / crime

మైనర్​తో పెళ్లి చేయాలని యువకుడు సజీవదహనం.. దర్యాప్తులో వెలుగుచూసిన కీలక అంశాలు

author img

By

Published : Jun 26, 2022, 10:02 PM IST

ప్రేమించిన బాలికతో వివాహం చేయడం లేదని.. ఓ యువకుడు సజీవ దహనం చేసుకున్నాడు. హైదరాబాద్​ పాతబస్తీలో ఓ టైలర్​ వద్ద పని చేస్తున్న యువకుడు... యజమాని కుమార్తెను ప్రేమించాడు.. వివాహం చేసేందుకు ఆమె తండ్రి నిరాకరించడంతో... బాలిక ఇంటి వద్ద యువకుడు ఒంటిపై డీజిల్​ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అయితే బాలికను కుటుంబంతో సహా చంపేందుకు యువకుడు పథకం ప్రకారం వెళ్లాడని పోలీసులు భావిస్తున్నారు.

1
1

Youngman burned alive: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ప్రేమించిన బాలికను ఇచ్చి పెళ్లి చేయడం లేదని.. ఓ యువకుడు సజీవదహనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చష్మా ప్రాంతానికి చెందిన జమాల్ అనే యువకుడు తీగలకుంటలో ఓ టైలర్​ వద్ద పని చేస్తున్నాడు. అతడి కుమార్తెను ప్రేమించిన జమాల్.. ఆమెను ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. అందుకు ఒప్పుకోని బాలిక తండ్రి.. మందలించడంతో చనిపోతానంటూ బెదిరించాడు.

శనివారం డీజిల్ క్యాన్​తో బాలిక ఇంటికి వెళ్లాడు. వారు భయంతో తలుపులు వేసుకోవటంతో.. తనపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన జమాల్​ను.. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. జమాల్​ను హత్య చేశారని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలోనే పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత రాత్రి బాలిక ఇంటికి డీజిల్ క్యాన్​తో పాటు 14 కిలోల సిలిండర్​నూ జమాల్ వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. డీజిల్ ఒంటిపై పోసుకుని, సిలిండర్ లీక్ చేసి జమాల్ నిప్పంటించుకున్నట్లు తేల్చారు. గత ఐదేళ్లుగా టైలర్ మోసిన్ వద్ద జమాల్ పని చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఏడాదిగా మోసిన్ కుమార్తెను ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్నారు. అయితే బాలికను కుటుంబంతో సహా చంపేందుకు జమాల్ పథకం ప్రకారం వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో బాలిక తండ్రి మోసిన్​కు ఫోన్ చేసి.. జమాల్ వాగ్వాదానికి దిగిన ఆడియో కాల్ రికార్డులు పోలీసులు పరిశీస్తున్నారు.

మైనర్ బాలికను ప్రేమించాననడంతో తండ్రి మోసిన్ జమాల్​ను మందలించాడని.. పెళ్లికి నిరాకరించడంతో గత రాత్రి సిలిండర్, డీజిల్​తో ఇంటికి వెళ్లాడని పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబం తలుపులు వేసుకోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. నిప్పంటించుకుని రెండో అంతస్తు నుంచి కిందకు దిగాడని తెలిపారు. గ్రౌండ్​ ఫ్లోర్​లో ఉన్న వారు మంటలు ఆర్పి.. 108కి సమాచారం ఇచ్చారని.. కానీ అప్పటికే జమాల్ మృతి చెందాడని ఫలక్​నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించారు. ఘటనపై జమాల్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.