ETV Bharat / crime

డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. వాహనాన్ని అక్కడే వదిలేసి పరార్​!

author img

By

Published : Feb 28, 2021, 1:25 PM IST

car accident at malakpet
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు

హైదరాబాద్​లోని నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

హైదరాబాద్ మలక్‌పేటలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చాదర్‌ఘట్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు అతివేగంగా వెళ్తున్న కారు.. నల్గొండ క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. కారులో నుంచి బయటికి దిగిన వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న చాదర్‌ఘట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

షాద్‌నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.