ETV Bharat / crime

ఇంట్లోనే గంజాయి పెంచుకుంటున్నాడు.. ఎక్కడంటే?

author img

By

Published : Nov 10, 2022, 9:55 AM IST

Updated : Nov 10, 2022, 10:42 AM IST

ganja cultivating
ganja cultivating

man was cultivating ganja: సులువుగా డబ్బు సంపాదించాలనుకున్న ఓ వ్యక్తి ఏవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు చేపట్టారు. కానీ గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుపడ్డ ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ వ్యక్తి ఇంటిపై దాడిచేసి అతని వద్ద నుంచి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి మొక్క కలకలం
man was cultivating ganja in ap: కొందరు ఆడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు వివిధ రకాల నేరాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా ఖాళీ స్థలంలో గంజాయి మొక్కలను పెంచుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నందుల పేటలో ఖాళీ స్థలంలో గోపి అనే వ్యక్తి గంజాయి మొక్కను పెంచుతున్నాడు. ఇటీవల తెనాలి డీఎస్పీ స్రవంతి రాయి ఆధ్వర్యంలో వరుసగా గంజాయి అమ్మేవ్యక్తులను అదుపులోకి తీసుకుంటూ వచ్చారు. గోపి అనే వ్యక్తి గంజాయి చెట్లు పెంచుతున్నట్లు ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు మందులు పేటలో బుధవారం రాత్రి స్థానిక పోలీసులు, సెబ్​ అధికారులు దాడి చేశారు. ఈ మేరకు గోపిన అదుపులోకి తీసుకున్నారు. చెట్టు నుంచి కోసిన ఆకులు సుమారు 500 గ్రాముల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెనాలిలో ఇంకా పలు ప్రాంతాల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు తెలిసిందని.. అలాంటివారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చదవండి

Last Updated :Nov 10, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.