ETV Bharat / crime

లారీ, ద్విచక్రవాహనం ఢీ... యువకుడు మృతి

author img

By

Published : Mar 3, 2021, 9:50 PM IST

కడప జిల్లా చిట్వేలు మండలం మార్గోపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని మోటార్ సైకిల్ ఢీకొట్టిన ఈ ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు.

man death in a road accident at margopalli kadapa district
లారీ-ద్విచక్రవాహనం ఢీ... యువకుడు మృతి

కడప జిల్లా రాజంపేట మండలం కడియవారిపల్లి గ్రామానికి చెందిన మనోహర్, వెంకటేశ్ అనే యువకులు ద్విచక్రవాహనంపై రైల్వేకోడూరు నుంచి చిట్వేలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చిట్వేల్ నుంచి రైల్వేకోడూరు వైపు వెళ్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మనోహర్ మృతి చెందగా... వెంకటేశ్​కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం వెంకటేశ్​ను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

రేపటి నుంచి మునిసిపల్​ ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.