ETV Bharat / crime

TEENMAR MALLANNA ARREST: తీన్మార్‌ మల్లన్న అరెస్ట్

author img

By

Published : Aug 28, 2021, 9:01 AM IST

తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్​ చేశారు. డబ్బుల కోసం బెదిరిస్తున్నారని తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తీన్మార్ మల్లన్నను అరెస్ట్​ చేశారు.
mallanna
mallanna

చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్​లోని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని మారుతీ జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు లక్ష్మీకాంత శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బాధితులు కొందరిని ఫోన్​లో మాట్లాడిస్తూ యూట్యూబ్ ఛానెల్​లో లైవ్ టెలికాస్ట్ ఇచ్చారని.. తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా ఉండాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలని తనను మల్లన్న బెదిరించారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: US Airstrike: అమెరికా ప్రతీకారం- ఐసిస్ స్థావరాలపై డ్రోన్​ దాడులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.