Actress Karate Kalyani: సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణిపై తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఆమె అత్యాచార బాధితురాలి వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారని రంగారెడ్డి జిల్లా కోర్టులో జగద్గిరిగుట్టకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో కరాటే కల్యాణిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Case On karate kalyani: సైదాబాద్ పీఎస్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం వివరాలను ఆమె తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారన్న అభియోగాలతో.. ఎల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన తూటంశెట్టి నితీశ్ జిల్లా కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు.
బాధితురాలి వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన కోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
ఇదీ చదవండి:
V-EPIQ theatre: రామ్ చరణ్ ప్రారంభించిన.. ఆసియాలోనే అతిపెద్ద సినిమా థియేటర్ మూసివేత..!