ETV Bharat / city

అఖిల భారత సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు

author img

By

Published : Mar 29, 2022, 5:57 PM IST

All India Strike : అఖిల భారత సమ్మెకు మద్దతుగా రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని నినదించారు.

All India Workers Federations
All India Workers Federations

అఖిల భారత సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు

All India Strike : అఖిల భారత సమ్మెకు మద్దతుగా రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వరంగ సంస్థల రక్షణ కోరుతూ విశాఖ రైల్వే డీఆర్ఎం ఆఫీస్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు కార్మిక సంఘాల జేఏసీ ర్యాలీ నిర్వహించింది. అటు అనంతపురంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రెండో రోజు ఏఐటీయూసీ, సీఐటీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లాలోనూ రెండో రోజు ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఏడురోడ్ల కూడలి వద్ద భారీ ఎత్తున మానవహారం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు పట్టణంలోని అనిబిసెంట్ కూడలిలో మానవహారం చేపట్టారు.

ఇదీ చదవండి : NBK on TDP @ 40 Years: కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట: బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.