ETV Bharat / city

‘మహిళలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి’

author img

By

Published : May 25, 2020, 12:09 AM IST

సోమవారం నుంచి ఈనెల 28 వరకు రాష్ట్రంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

weather-latest-details-in-andhra-pradesh
ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ

విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల 44-46 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 44-46 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. కడప, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల 44-46 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ శాఖ… శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల 41-43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల 41-43 డిగ్రీలు, నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

మే 26న విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల 44-45 డిగ్రీలు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 44-45 డిగ్రీలు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల 44-45 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల 44-45 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 42-43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

మే 27న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల 44-45 డిగ్రీలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 44-45 డిగ్రీలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 44-45 డిగ్రీలు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల 44-45 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల 38-40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

మే 28న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల 44-46 డిగ్రీలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల 44-46 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్నిచోట్ల 40-43 డిగ్రీలు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 40-43 డిగ్రీలు, చిత్తూరు, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల 40-43 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల 40-43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

రాత్రి పూట కూడా సాధారణం కంటే 1-2 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ శాఖ… ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రజలు బయట రాకూడదని సూచించింది. వడగాలుల దృష్ట్యా మహిళలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.