ETV Bharat / city

జర్రకొండ వద్ద కొట్టుకుపోయిన కల్వర్టు... నిలిచిన రాకపోకలు

author img

By

Published : Oct 13, 2020, 11:54 AM IST

కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యం హుకుంపేట మండలంలోని జర్రకొండ వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

The culvert at Jarrakonda in Visakhapatnam Hukumpeta zone was washed away due to heavy rains.
కొట్టుకుపోయిన కల్వర్టు


విశాఖ మన్యం పాడేరు ఏజెన్సీలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. హుకుంపేట మండలం జర్రకొండ వెళ్లే మార్గంలో కల్వర్టు కొట్టుకుపోయింది. జర్రకొండ పంచాయతీ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఆమూరు వెళ్లే రహదారి వరద ఉద్ధృతికి మునిగిపోయింది. అవతలి వైపు వెళ్ళడానికి రాకపోకలు స్తంభించాయి.

Submerged road to flood excavation
వరద ఉద్ధృతికి మునిగిన రహదారి

నేలకొరిగిన భారీ వృక్షం
కుండపోత వర్షాలకు విశాఖ ముడసరలోవలో భారీ వృక్షం నేలకొరిగింది.. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న మర్రిచెట్టు కూకటివేళ్ళతో సహా లేచిపోయి పడిపోయింది. ఈ ప్రాంతంలో ఈ మర్రిచెట్టు చాలా ప్రాచుర్యం పొందింది. రహదారిపై చెట్టు కొమ్మలను తొలగించే పనిని అధికారులు చేపట్టారు.

A huge tree that fell to the ground
నేలకొరిగిన భారీ వృక్షం

ఇదీ చదవండి:

రాష్ట్రంలో భారీ వర్షాలు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.