ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వివేకానంద యువజనోత్సవాలు

author img

By

Published : Jan 12, 2021, 4:18 PM IST

Updated : Jan 12, 2021, 4:31 PM IST

రాష్ట్రవ్యాప్తంగా వివేకానంద యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివేకానందుడి జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. తెదేపా నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పలువురు మాట్లాడుతూ.. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

swamy Vivekananda 158th birth anniversary
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వివేకనంద యువజనోత్సవాలు

ఎన్టీఆర్ భవన్​లో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి తెదేపా నేతలు నివాళులర్పించారు. వివేకానందుడి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్​బాబు, గురజాల మాల్యాద్రి, కిలారి నాగశ్రవణ్, తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, వల్లూరు కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

స్వామి వివేకానంద 158వ జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ నిర్వాహకులు పేదలకు చీరలు పంపిణీ చేశారు. హైందవ మతం గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత స్వామి వివేకానందుడికే దక్కుతుందన్నారు. హిందూ మత ప్రచారం కోసం ప్రపంచ దేశాలు పర్యటించిన మహా యోగిగా వివేకానందను అభివర్ణించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట జనరల్ పాఠశాలలో.. స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. సామాజిక సమరస్యత సమితి ఆధ్వర్యంలో వివేకనందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి పాటలు పాడారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో వివేకానంద విగ్రహానికి.. గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని సమితి సభ్యులు తెలిపారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భవన్ లో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి, పూజలు చేసి మిఠాయిలు పంచారు. స్వామి వివేకానంద వ్యాఖ్యలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమైనవని.. వాటిలో కొన్నైనా పాటిస్తే జీవితంలో సుఖశాంతులతో మెలుగుతామని తెలిపారు.

ఇవీ చూడండి...: సంక్రాంతి వేళ రైతుకు ఏమిటీ కష్టం?: చంద్రబాబు

Last Updated : Jan 12, 2021, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.