ETV Bharat / city

విశాఖ ఆస్పత్రి నుంచి డాక్టర్​ సుధాకర్​ డిశ్చార్జ్​

author img

By

Published : Jun 5, 2020, 9:29 PM IST

Updated : Jun 5, 2020, 10:27 PM IST

విశాఖ ఆస్పత్రి నుంచి వైద్యుడు సుధాకర్ డిశ్చార్జ్
విశాఖ ఆస్పత్రి నుంచి వైద్యుడు సుధాకర్ డిశ్చార్జ్

హైకోర్టు తీర్పుతో విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యాలయం నుంచి వైద్యుడు సుధాకర్​ డిశ్చార్జ్​ అయ్యారు. కోర్టు కాపీని అందించి ఆస్పత్రి నుంచి సుధాకర్​ను బంధువులు బయటకు తీసుకువచ్చారు.

హైకోర్టు ఆదేశాలతో విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యాలయం నుంచి వైద్యుడు సుధాకర్​ డిశ్చార్జ్​ అయ్యారు. కోర్టు తీర్పుల కాపీలను ఆస్పత్రి అధికారులకు అందించిన సుధాకర్​ తల్లి కావేరి బాయి, బంధువు విజయ్​కుమార్, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితలు ఆయన్ను​ బయటకు తీసుకువచ్చారు. సుధాకర్​కు కొన్నాళ్లు ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించనున్నట్లు వంగలపూడి అనిత తెలిపారు.

వైద్యుడు సుధాకర్​ గత నెల 16న ప్రభుత్వ మానసిక వైద్యాలయంలో పోలీసులు చేర్చారు. కాగా తన కుమారుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడో తెలపాలంటూ సుధాకర్​ తల్లి హైకోర్టులో గురువారం హెబియస్​ కార్పస్​ పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. సుధాకర్​ను డిశ్చార్జ్​ చెయ్యాలని ఆదేశించింది.

ఇదీ చదవండి..

పోలీసుల విజ్ఞప్తి: దయచేసి పాడెను ఇక్కడ దించొద్దు

Last Updated :Jun 5, 2020, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.