ETV Bharat / city

విద్యుత్ చార్జీల టారిఫ్ పై ప్రజాభిప్రాయసేకరణ

author img

By

Published : Jan 18, 2021, 8:39 PM IST

విశాఖలో విద్యుత్ చార్జీల టారిఫ్ పై మూడు రోజుల పాటు జరిగే బహిరంగ ప్రజాభిప్రాయసేకరణ ఆరంభమైంది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ప్రారంభించింది.

Referendum on tariff on electricity charges in Visakhapatnam
విద్యుత్ చార్జీల టారిఫ్ పై ప్రజాభిప్రాయసేకరణ

విద్యుత్ చార్జీల టారిఫ్ పై మూడు రోజుల పాటు సాగే బహిరంగ ప్రజాభిప్రాయసేకరణ విశాఖలో ప్రారంభమైంది. ఈనెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా ప్రజలు తమ సమస్యలను ఈఆర్సీ దృష్టికి తీసుకురానున్నాయి.

ప్రజలు తమ పరిధిలోని ఆయా విద్యుత్ సర్కిల్, డివిజన్ కార్యాలయం ద్వారా వీడియో కాన్ఫెరెన్స్​లో పాల్గొని.. తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఈ బహిరంగ విచారణ జరిగే తీరును ముందుగానే వివరించారు.

విద్యుత్ పంపిణీ సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై నివేదికలను ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వీటిని బహిరంగ ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేశాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ, ఏపీట్రాన్స్​కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ నగరంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.