ETV Bharat / city

'విశాఖ ఉక్కు పోరాటంలో ఇది మొదటి మెట్టు'

author img

By

Published : Feb 6, 2021, 10:37 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరణ నుంచి కాపాడుకుందామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. తన ట్వట్టర్ ఖాతాకు విశాఖ స్టీల్​ ప్లాంటును ప్రైవేటీకరించొద్దనే పిటిషన్​ను జతచేసి.. ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలని కోరారు.

RammohanNaidu_Signature_Campaign_On_viskhapatnam_steel plant
'విశాఖ ఉక్కు పోరాటంలో ఇది మొదటి మెట్టు'

తెలుగువారి సంకల్పానికి ద్రోహం జరగకుండా.. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు కార్పొరేటర్ల నుంచి కాపాడుకుందామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్​ ప్లాంటును ప్రైవేటీకరించొద్దనే పిటిషన్​ను తన ట్విట్టర్​కు జతచేశారు. దానిపై ప్రతిఒక్కరూ సంతకాలు చేయాలని కోరారు.

'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ ప్రజలు పోరాడి.. ఆనాడు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును ఎందుకు ప్రవేటీకరించవద్దో పిటిషన్​ను చదివి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంతకం ద్వారా ప్రైవేటీకరణను వ్యతిరేకరించాలని రామ్మోహన్​నాయుడు అన్నారు. ఇది విశాఖ ఉక్కు కోసం పోరాటంలో మొదటి మెట్టుగా ఆయన పేర్కొన్నారు.

  • విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకుందాం! విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎన్నో త్యాగాలు చేసిన తెలుగు వారి సంకల్పానికి ద్రోహం జరక్కుండా అడ్డుకుందాం. ఎందుకు ప్రవేటీకరించద్దో ఇక్కడ చదివి, మీ సంతకంతో మద్దతు తెలపండి. విశాఖ ఉక్కు కోసం మన పోరాటంలో ఇది మొదటి మెట్టు!https://t.co/hdN2Hgto0R

    — Ram Mohan Naidu K (@RamMNK) February 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

కిరణ్ కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.