ETV Bharat / city

జపాన్ తరహాలో ఉత్తరాంధ్ర అడవుల్లో మొక్కల పెంపకం

author img

By

Published : Sep 9, 2020, 9:52 PM IST

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అడవుల పెంపకంలో వినూత్న కార్యక్రమానికి అటవీశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జపాన్​లో విజయవంతమైన అఖిరా మియావాకి విధానం ఉత్తరాంధ్ర జిల్లాలోని నర్సరీలో ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నారు. కొద్దిపాటి ఖర్చుతోనే అందమైన మొక్కలను ఈ విధానంలో పెంచేందుకు కార్యాచరణ చేయనున్నారు. తక్కువ భూముల్లో ఎక్కువగా మొక్కలు నాటించి దట్టమైన పచ్చదనం సృష్టిస్తారు.

Plant breeding in ap
Plant breeding in ap

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అడవుల పెంపకంలో వినూత్న కార్యక్రమానికి అటవీశాఖ అధికారులు చేపట్టనున్నారు. 10 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, రెండు అడుగుల లోతులో కందకం తవ్వి వాటిలో వివిధ రకాల మొక్కలు నాటిస్తారు. ఇందుకుగాను హెక్టారుకు 13 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

విశాఖ జిల్లాలోని నాతవరం మండలం పెడిమికొండ, నర్సీపట్నం, గూడెంకొత్తవీధి మండలం సీలేరు తదితర ప్రాంతాల్లో అటవీ శాఖ, ఎలమంచిలి, చోడవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సామాజిక విభాగాలకు నర్సరీలు ఉన్నాయి. వీటిలో కొంత ప్రాంతాన్ని అడవుల పెంపకానికి కేటాయిస్తారు. నర్సరీల్లో నీరు ఇతర సదుపాయాలు సిబ్బంది అందుబాటులో ఉన్న ఈ ప్రాంతంలో మొక్కల పెంపకానికి అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాటు ఔషధ విలువలు కలిగిన మొక్కలు పెంపకం ఈ ఏడాది ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మారేడు, నేరేడు, తెళ్ళమద్ది తదితర రకాలు విరివిగా నాటించాలని నిర్ణయించారు.

ఈ ఏడాది నర్సరీల్లో ఇందుకు అవసరమైన మొక్కలు పెంచుతారు. రానున్న వర్షాకాలంలో నటించేందుకు వీలుగా సిద్ధం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏటికొప్పాక బొమ్మలు గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ బొమ్మల తయారీకి అంకుడు కర్రను వినియోగిస్తుంటారు. జిల్లాలోని గతంలో ఈ కర్ర ఎక్కువగా దొరికే చెట్లు నరకడం వల్ల ఇప్పుడు లభ్యత తగ్గింది. ఈ చెట్టు నుంచి విత్తనాలు సహజంగా వెదజల్లుతుంటాయి. ఎక్కువ మొక్కలు సహజంగా ఎదిగేవి. అనేక మంది జీవనాధారమైన ఆంకుడు చెట్లను కాపాడుకునేలా ప్రజలను ఈ సందర్భంగా చైతన్యం చేయనున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలలో అటవీ శాఖ పరంగా ప్రైవేటుపరంగా ఉన్న 300 వరకు ఉన్న నర్సరీలలో ఈ రకమైన మొక్కలను పెంచే ఆలోచన దిశగా కార్యాచరణ రూపొందించారు. మైదాన ప్రాంత వాసులకు అందమైన ప్రకృతిని దగ్గర చేసేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి:

అంతర్వేదిలో రథం దగ్ధం..ఎగసిపడుతున్న ఆగ్రహ జ్వాలలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.