ETV Bharat / city

ఈనెలాఖరుకు విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు

author img

By

Published : Oct 21, 2019, 2:37 PM IST

ఈనెల 27 నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. విశాఖ-చెన్నై, విశాఖ-విజయవాడల మధ్య స్పైస్​జెట్ సంస్థ విమానాలను నడపనుంది.

ఈనెల 27 నుంచి విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు

ఈనెలాఖరుకు విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు

ఈ నెలాఖరుకు విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27 నుంచి విశాఖ-చెన్నైకు స్పైస్​జెట్ సంస్థ విమాన సర్వీసులు ఆరంభించనుంది. ఉదయం 6 గంటల 35నిమిషాలకు చెన్నైలో బయలుదేరి ఉదయం 8గంటల 10నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. మళ్లీ ఉదయం 11.20 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 12.55కి చెన్నై చేరుకుంటుంది.

విశాఖ-విజయవాడ మధ్య మరో విమాన సర్వీసు ఉదయం 8.30 గం.కు విశాఖలో బయలుదేరి 9.30కి విజయవాడ చేరుతుంది. ఉదయం 9.50 గం.కు విజయవాడలో బయలుదేరి 10.50కి విశాఖ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన 6 రోజుల్లో సర్వీసులు నడుపుతామని స్పైస్​జెట్ సంస్థ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి..

ఇసుక కొరతను అధిగమించడంలో ప్రభుత్వం విఫలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.