ETV Bharat / city

'2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం'

author img

By

Published : Nov 20, 2020, 7:25 PM IST

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వం ఎలాంటి భ్రమల్లో లేదని, ఎస్​ఈసీ, చంద్రబాబే భ్రమల్లో ఉన్నారని ఆరోపించారు. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. కరోనా రెండో దశ విజృంభిస్తుందన్న హెచ్చరికల దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం లేదన్నారు. భోగాపురం విమానాశ్రయానికి త్వరలో సీఎం జగన్​ శంకుస్థాపన చేస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్​ నాటికి పూర్తి చేస్తామన్నారు.

ministers
ministers

విశాఖ కలెక్టరేట్​లో పరిశ్రమలు, అభివృద్ధిపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్​ పారిశ్రామిక సంస్థలతో సమావేశం నిర్వహించినట్లు పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి వివక్షలేకుండా పరిశ్రమల అభివృద్ధికి ఊతమందిస్తామని ఆయన స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి ఆకాంక్షతో పారిశ్రామిక విధానం తీసుకొచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం పరిశ్రమలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఔత్సాహిత పారిశ్రామికవేత్తలు ఎవరు ముందుకు వచ్చినా అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

రమేశ్ కమిషన్​లా వ్యవహరిస్తున్నారు : మంత్రి కన్నబాబు

ఎస్​ఈసీపై మంత్రి కన్నబాబు విమర్శలు

విశాఖలో పారిశ్రామిక ప్రగతిపై రేపు మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నట్టు జిల్లా ఇన్​ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రెండు, మూడు కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, ఇప్పుడు రెండో దశ కొవిడ్ విజృంభిస్తుంటే ఎన్నికలు పెడతానని రాష్ట్ర ఎన్నికల కమిషన్​ అంటోందన్నారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఎన్నికలు పెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు...ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎస్​ఈసీని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.

ఎస్​ఈసీ..రాజ్యాంగ సంస్థలా కాకుండా రమేశ్ కమిషన్​​లా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికలకు భయపడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. కొవిడ్ రెండో దశ దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు అనుకూల పరిస్థితులు లేవంటున్నామన్నారు. బిహార్ ఎన్నికల తర్వాత కేసులు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెదేపా సమయంలో ఎందుకు ఎన్నికలు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి భ్రమల్లో లేదని, ఎస్ఈసీ, చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని విమర్శించారు. ఎస్​ఈసీ కోర్టులకు వెళ్లిన తమకు ఎటువంటి అభ్యంతరంలేదని మంత్రి కన్నబాబు అన్నారు.

అందుకే పోలవరం వద్ద వైఎస్ విగ్రహం : విజయసాయిరెడ్డి

పోలవరంపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు

అతి త్వరలో భోగాపురం విమానాశ్రయానికి సీఎం శంకుస్థాపన చేస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తెదేపా ఎన్​ఆర్​ఐ పార్టీలా వ్యవహరిస్తుందని విమర్శించారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. పోలవరం పూర్తి అవ్వకుండా తెదేపా అడ్డుపడుతుందన్నారు. పోలవరం వద్ద 150 అడుగుల వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తెదేపా సహించలేకపోతుందని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేసేందుకు.. సర్కారు వేగంగా పనులు చేయిస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రాజెక్టుకు బీజం వేశారని చెప్పారు. అందుకే పోలవరం వద్ద ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్.. తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ విలువలను పాటించడంలేదన్నారు.

ఇదీ చదవండి : 'బాలల్లో స్ఫూర్తి నింపేందుకు కిడ్స్ టేకోవర్ కార్యక్రమం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.