ETV Bharat / city

నేటి నుంచే భారత్, జపాన్​ల మధ్య 'జిమెక్స్' నావికా విన్యాసాలు

author img

By

Published : Sep 26, 2020, 9:16 AM IST

నేటి నుంచి మూడు రోజులపాటు భారత్, జపాన్​ నేవీల సంయుక్త విన్యాసాలు 'జిమెక్స్' ఉత్తర ఆరేబియా సముద్రంలో జరుగనున్నాయి. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ప్రతీకగా వీటిని 2012 నుంచి నిర్వహిస్తున్నారు.

jimex 2020
జిమెక్స్-2020


భార‌త్ - జ‌పాన్ నేవీల సంయుక్త విన్యాసాలు 'జిమెక్స్' ఉత్త‌ర ఆరేబియా స‌ముద్రంలో మూడు రోజుల పాటు జ‌రుగుతాయి. ఈ త‌ర‌హా సంయుక్త విన్యాసాలు జ‌ర‌గ‌డం ఇది నాలుగోసారి. శ‌నివారం నుంచి సోమ‌వారం వ‌ర‌కు ఈ విన్యాసాలు భార‌త జ‌పాన్ దేశాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ప్ర‌తీకగా నిర్వ‌హిస్తున్నారు.

గ‌తంలో ఇదే త‌ర‌హా విన్యాసాలు 2018లో విశాఖ కేంద్రంగా జ‌రిగాయి. ప్ర‌తి రెండేళ్ల కొక‌సారి క్ర‌మం త‌ప్ప‌కుండా జ‌రుగుతున్న ఈ విన్యాసాలు 2012లో ఆరంభ‌మ‌య్యాయి. ఇండో- జ‌ప‌నీస్ వ్యూహాత్మ‌క ర‌క్ష‌ణ సంబంధాలు ఈ త‌ర‌హా విన్యాసాల ద్వారా మ‌రింత బలపడుతోంది. రెండు నేవీలలో ఉన్న బ‌హుముఖ ప‌రిజ్ఞానం ప‌ర‌స్ప‌రం అవ‌గ‌తం చేసుకునేందుకు ఇదొక అవ‌కాశంగా భావిస్తున్నారు. దేశీయ ప‌రిజ్ఞానంతో రూపుదిద్దుకున్న త‌ర్క‌ష్, దీప‌క్ నౌక‌లు భార‌త నౌకాద‌ళం నుంచి ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భార‌త బృందానికి రియ‌ర్ అడ్మిర‌ల్ కృష్ణ‌స్వామినాధ‌న్ నేతృత్వం వ‌హిస్తున్నారు. జ‌పాన్ నేవీ నుంచి క‌గ‌, ఇగ‌చుచి నౌక‌లు పాల్గొంటున్నాయి. జ‌పాన్ బృందానికి క‌న్నోయుగ‌సుకి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇదీ చదవండి: రెండు దేశాలతోనూ ఒకేసారి యుద్ధానికి సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.