ETV Bharat / city

విశాఖ రైల్వేస్టేషన్​లో రూ.100కే 30 రకాల వైద్య పరీక్షలు..!

author img

By

Published : Jan 29, 2021, 8:15 PM IST

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన తూర్పుకోస్తా రైల్వే జనరల్ మేనేజర్ విద్యాభూషణ్... స్టేషన్​లో మొబైల్ హెల్త్ కియోస్క్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రయాణికులు రూ.100కే 30 రకాల వైద్య పరీక్షలు చేయించుకునే వెసులుబాటును రైల్వే అధికారులు కల్పించారు. అనంతరం స్టేషన్‌లోని సౌకర్యాలు, సదుపాయాలను వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి విద్యాభూషణ్ పరిశీలించారు.

East Coast Railway General Manager Vidya Bhushan visits Visakhapatnam Railway Station
విశాఖ రైల్వేస్టేషన్​లో రూ. 100 లకే 30 రకాల వైద్య పరీక్షలు

తూర్పుకోస్తా రైల్వే జనరల్ మేనేజర్ విద్యాభూషణ్.. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి రైల్వే స్టేషన్​లోని వివిధ సౌకర్యాలు, సదుపాయాలను పరిశీలించారు.

మొబైల్ హెల్త్ కియోస్క్‌ ప్రారంభం..

ప్లాట్ ఫామ్ నెంబర్​ 1లో మొబైల్ హెల్త్ కియోస్క్‌ను జీఎం విద్యాభూషణ్ ప్రారంభించారు. ఈ కియోస్క్‌ ద్వారా రైల్వే ప్రయాణికులు నాన్-ఫేర్ రెవెన్యూ చొరవ కింద కేవలం రూ.100కే 30 రకాల వైద్య పరీక్షలు చేయించుకునే సదుపాయాన్ని కల్పించారు. అక్కడ పునరుద్ధరించిన రిజర్వ్ లాంజ్​ను ఆయన ప్రారంభించారు. దీన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు.

మహిళా ఆర్పీఎఫ్ బృందానికి ప్రశంస..

రైల్వే స్టేషన్లు, ట్రైన్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం నియమించిన ఆర్పీఎఫ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ 'మేరీ సహేలి' బృందంతో జీఎం సంభాషించారు. చిన్నారులను రక్షించడం, ఆడపిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో మహిళా ఆర్పీఎఫ్ బృందం చేసిన కృషిని ప్రశంసించారు.

350 వాట్ల పైకప్పు సౌర ఫోటోవోల్టాయిక్ ప్లాంట్‌ ప్రారంభం..

విశాఖపట్నం రైల్వే స్టేషన్​లో నూతనంగా నిర్మించిన 350 వాట్ల పైకప్పు సౌర ఫోటోవోల్టాయిక్ ప్లాంట్‌ను విద్యాభూషణ్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ రోజుకు 1200 యూనిట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. దీని ద్యారా ఏడాదికి రూ.10 లక్షలు రైల్వే వ్యవస్థకు ఆదా అవుతుందని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం..

అనంతరం విశాఖపట్నం ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్, విశాఖ మర్రిపాలెం, మంగళపాలెం వద్ద అండర్ గ్రౌండ్ మార్గాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఎం ప్రారంభించారు. విజయనగరంలో లోకో షంటింగ్ నెక్, బచేలీలో సిబ్బందికి రన్నింగ్ రూం ఎయిర్ కండిషనింగ్, శ్రీకాకుళం రోడ్ వద్ద క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ సౌకర్యం, కోటబొమ్మాలిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్​ను ప్రారంభించారు. వాల్తేర్ డివిజన్​లో చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలను లాంజ్‌లో ప్రదర్శించారు. వీటి గురించి జీఎంకు డీఆర్‌ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ వివరించారు.

ఇదీ చదవండి:

కోట్లకు పడగలెత్తిన ఏఈ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.