ETV Bharat / city

భారత నౌకాసంపత్తిలోకి మరో యుద్ధ నౌక

author img

By

Published : Oct 22, 2020, 5:21 PM IST

Another warship into the Indian navy
భారత నౌకాసంపత్తిలోకి మరో యుద్ధ నౌక

భారత నౌకాసంపత్తిలో మరో యుద్ధ నౌక చేరింది. ఐఎన్ఎస్ కవ్రత్తి యుద్ధనౌకను ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే లాంఛనంగా ప్రవేశపెట్టారు. దీన్ని దేశీయ డిజైన్​తో రూపొందించారు. అత్యున్నత స్థాయి ఆయుధాలను గుర్తించే సెన్సార్​లు ఉండటం ఈ నౌత ప్రత్యేకత. కమాండర్ సందీప్ సింగ్ ఈ నౌకకు తొలి కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు.

భారత నౌకాదళం సంపత్తిలో మరో యుద్ధనౌక చేరింది. యాంటి సబ్​మెరైన్ వార్ ఫేర్ ప్రాజెక్టు-28 కమోర్ట తరగతిలోని చివరిదైన ఐఎన్ఎస్ కవ్రత్తి యుద్ధనౌకను ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే లాంఛనంగా ప్రవేశపెట్టారు. విశాఖలోని నౌకాదళ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో.. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, ఈ యుద్ధ నౌకను నిర్మించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్లు(జిఆర్​ఎస్​ఈ) కోల్​కత్తా సంస్థ సీఎండీ రియర్ అడ్మిరల్ విపిన్ కుమార్ సక్సేనా ఇతర ఉన్నతాధికార్లు పాల్గొన్నారు.

నౌకాదళంలోకి ఈ తరగతి కింద నాలుగు నౌకలు దేశీయంగానే రూపొందించారు. దేశీయ డిజైన్​తో రూపొందించిన ఈ సబ్​మెరైన్ వార్ ఫేర్, డైరక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ ఇచ్చిన ప్రమాణాలతో కోల్​కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్ల సంస్థ ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ నౌకలను తయారుచేసింది. ఈ తరగతిలో 2014లో కమోర్ట, 2016లో కడ్మట్, 2017లో కిల్తన్ నౌకలను నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ తరగతిలో ఐఎన్ఎస్ కవ్రత్తి చివరిది. వీటివల్ల దేశీయంగా మన రక్షణ దళాలకు అదనపు ఆయుధ సంపత్తి సమకూరింది.

ఈ నౌకలో అత్యున్నత స్థాయి ఆయుధాలను గుర్తించే సెన్సార్​లున్నాయి. జలాంతర్గాముల కదలికలను పసిగట్టగలిగే వ్యవస్థలు ఈ యుద్ధనౌకలో ఉన్నాయి. దీర్ఘకాలం సముద్రంపై పోరాడగల సత్తా ఈ నౌకల సొంతం. సముద్రంపై ఈ నౌక సత్తాను పలుమార్లు విజయవంతంగా పరీక్షించారు. అన్ని రకాల పరీక్షల్లో ఈ నౌకలు తమ సామర్ధ్యాన్ని రుజువు చేసుకున్నాయి. కవ్రత్తి లక్ష ద్వీప్ రాజధాని అర్నల తరగతి మిస్సైల్ నుంచి ఈ పేరు తీసుకున్నారు. ఈ నౌక 109 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పు ఉంది. 3300 టన్నుల సామర్ధ్యం ఈ నౌక సొంతం. ఈనౌకలో 134 మంది నావికులు, 12 మంది అధికార్లు ఉంటారు. కమాండర్ సందీప్ సింగ్ ఈ నౌకకు తొలి కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. తూర్పు నౌకాదళంలో ఇది ఉంటుంది.

ఇదీ చదవండీ... ఆరునెలలు గడిచినా అందని సాయం..ఎల్జీ పాలిమ్స్‌ ఘటన బాధితుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.