ETV Bharat / city

తాగునీటి సమస్య పై ఖాళీ బిందెలతో నిరసన

author img

By

Published : Dec 24, 2020, 1:21 PM IST

తాగునీటిని అందించాలని కోరుతూ... విజయవాడ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ శాఖ వారికి ఫిర్యాదు చేస్తున్నప్పటికి పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు. వంద గృహాలకు ఒక ట్యాంకర్ నీళ్లను పంపి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు.

protested for water problem
తాగునీటి సమస్య పై ఖాళీ బిందెలతో నిరసన

విజయవాడ నగర శివారు కండ్రిక జి ప్లస్ త్రీ అపార్ట్మెంట్ల వాసులు తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఏడాదిగా మంచినీరు అందటం లేదని ఫిర్యాదు చేస్తున్నా మున్సిపల్ శాఖ వారికి పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమానికి స్థానిక డీవైఎఫ్​ఐ నాయకులు మద్దతు తెలిపారు.

తమకు శాశ్వత ప్రాతిపదికన మంచినీరు అందించాలని స్థానికులు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. వెంటనే ఈ ప్రాంతంలో నెలకొన్న అసౌకర్యం తొలగించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి నైజాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సి.పి.ఎం నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ...అరకు ఆదివాసీల పాటను ఆస్వాదించిన పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.