ETV Bharat / city

Gadkari to visit vijayawada: రేపు విజయవాడలో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటన

author img

By

Published : Feb 16, 2022, 5:34 PM IST

Updated : Feb 16, 2022, 7:46 PM IST

Gadkari to visit vijayawada: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం విజయవాడలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 11.45 గంటలకు గన్నవరం చేరుకోనున్న ఆయన.. మధ్యాహ్నం 12.15కు జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్​ హాజరుకానున్నారు.

union minister nithin Gadkari to visit vijayawada on february 17th
రేపు విజయవాడలో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటన

Gadkari to visit vijayawada: రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన జాతీయ రహదారులకు చెందిన రూ.21,559 కోట్ల విలువైన 31 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కొత్తగా మంజూరైన వాటికి భూమిపూజలను.. విజయవాడలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, సీఎం జగన్‌ చేతుల మీదుగా గురువారం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 11.45 గంటలకు గన్నవరం చేరుకోనున్న గడ్కరీ.. అక్కడి నుంచి ఇందిరాగాంధీ స్టేడియానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.15కు ఫొటో ఎగ్జిబిషన్‌ సందర్శించి.. జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.

జాతీయ రహదారులకు చెందిన రూ.21,559 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:45 గంటలకు బెంజ్‌ సర్కిల్‌ పైవంతెనను గడ్కరీ ప్రారంభిస్తారు. అనంతరం 2 గంటలకు తాడేపల్లి వెళ్లనున్నారు. జాతీయ రహదారి ప్రాజెక్టులపై సీఎంతో సమీక్షించిన అనంతరం.. మధ్యాహ్న భోజనం చేస్తారు.

మధ్యాహ్నం 3.20 గం.కు దుర్గగుడి సందర్శన, ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం 4 గం.కు భాజపా కార్యాలయంలో గడ్కరీకి సత్కారం నిమిత్తం.. 5.30కు గన్నవరం నుంచి గడ్కరీ నాగ్‌పూర్‌ వెళ్తారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 16, 2022, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.