ETV Bharat / city

పెరిగిన డీజిల్‌ ధరలు.. సంక్షోభంలో లారీ పరిశ్రమ

author img

By

Published : May 27, 2022, 5:00 AM IST

పెరిగిన డీజిల్‌ ధరలు.. సంక్షోభంలో లారీ పరిశ్రమ
పెరిగిన డీజిల్‌ ధరలు.. సంక్షోభంలో లారీ పరిశ్రమ

రోజు రోజుకూ పెరుగుతోన్న డీజిల్ ధరలు లారీ యజమానులను నష్టాల్లోకి నెడుతున్నాయి. కొవిడ్ రాకతో కష్టాలు ప్రారంభంకాగా.. నేటికీదాని ప్రభావం పోలేదు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో లారీ యజమానులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఓ వైపు డీజిల్ ధరలు పెరుగుతున్నా.. పోటీ వల్ల కిరాయిలు పెంచే పరిస్థితి లేకపోవడంతో నష్టాల్లో కూరుకుపోతున్నారు.

పెరిగిన డీజిల్‌ ధరలు.. సంక్షోభంలో లారీ పరిశ్రమ

పెరుగుతోన్న డీజిల్ ధరలు లారీ పరిశ్రమపై పెను ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో 50 వేలకు పైగా లారీలు ఉండగా.. వీటిపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. గతంలో ఇంధన ధరలు పెరిగినపుడు.. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా లారీ కిరాయిలు పెంచేవారు. అన్ని చోట్ల ఒకే విధమైన ధరలు ఉండటంతో ఎక్కువగా నష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు రోజు వారీగా ఇంధనం ధరలు పెరుగుతుండటంతో.. ఒకే కిరాయి రేటు సాధ్యపడటం లేదని లారీ యాజమాన్యాలు అంటున్నాయి.

కేంద్రం వేసే పన్నులకు అదనంగా రాష్ట్రాలు ప్రత్యేకంగా పన్నలు విధించడం వల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు ఉంటోంది. దేశంలో ఎక్కడా లేని రీతిలో.. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధిస్తోందని లారీ యజమానులు వాపోతున్నారు. ఫలితంగా చుట్టూ ఉన్న రాష్ట్రాల కంటే.. ఏపీలోనే డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కిరాయిలు తక్కువగా ఉండటం, ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల.. పరిశ్రమల నుంచి గిరాకీలు రావడం లేదంటున్నారు తప్పని సరి పరిస్థితుల్లో నష్టమొస్తుందని తెలిసినా లారీలు నడుపుతున్నామని లారీ యజమానులు ఆవేదన చెందుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ డిమాండ్ పడిపోయినా.. డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతూనే పోతోందని లారీ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. సెస్ సహా ఇతర పన్నులను కేంద్రం వసూలు చేస్తుందంటున్నారు. ఇదే భారంగా ఉంటే దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రోడ్ టాక్స్, సెస్ ను విధిస్తోందని.. ఫలితంగా తమకు నష్టాలు తప్పడం లేదని లారీయజమాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించినా అందుకు అనుగుణంగా రాష్ట్రాలూ తగ్గించాల్సి ఉన్నా అలా చేయడం లేదంటున్నారు. ఇటీవల రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినా రాష్ట్రం మాత్రం పైసా కూడా తగ్గించలేదంటున్నారు. రేట్లు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పలు మార్లు కోరినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లారీ పరిశ్రమ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని.. తమని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని లారీ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.