ETV Bharat / city

Boy died by fell under the bus: అన్న బడికి వెళ్తుంటే సాగనంపాడు..కానీ అంతలోనే

author img

By

Published : Dec 14, 2021, 2:06 PM IST

Three years old boy died by fell under bus: ఆ తండ్రి పెద్ద కుమారుడ్ని పాఠశాలకు పంపేందుకు స్కూల్ బస్సు ఎక్కించాడు. వెనుకే వచ్చిన చిన్న కుమారుడిని గమనించలేదు. అన్నకు వీడ్కోలు చెప్పిన ఆ చిన్నారి.. కనురెప్పపాటులో బస్సు చక్రం కిందపడి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ దుర్ఝటన కృష్ణా జిల్లా కోడూరులో చోటు చేసుకుంది.

Boy died by fell under the bus wheel
బస్సు చక్రం కిందపడి బాలుడి మృతి

Small boy died by fell under bus wheel: కృష్ణాజిల్లా కోడూరుకు చెందిన కోడూరు శ్రీనివాసుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కోడూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. చిన్న కుమారుడు దినేష్ కుమార్. పాఠశాల సమయం కావడంతో రోజులానే శ్రీనివాస్ స్కూలుకు పంపడానికి తన పెద్ద కుమారుడిని తీసుకుని రహదారిపైకి వచ్చి బస్సు ఎక్కించాడు. అన్నకు టాటా చెప్పేందుకు బుడిబుడి అడుగులతో తన వెనకే వచ్చిన చిన్న కుమారుడ్ని తండ్రి గమనించలేదు. సమయం అయిపోతుందన్న హడావిడిలో పాఠశాల బస్సు చక్రం కింద ఉన్న దినేష్​ను ఎవ్వరూ గమనించలేదు. డ్రైవర్ బస్సును ముందు నడపగా.. అప్పటికే బస్సు చక్రం కింద ఉన్న దినేశ్ పైనుంచి చక్రం వెళ్లడంతో తల భాగమంతా నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎవరూ ఊహించని ఈ హఠాత్పరిణామంతో తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న కోడూరు ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి :

Fake Currency: కలర్‌ ప్రింటర్​తో నకిలీ నోట్లు.. పోలీసుల అదుపులో నిందితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.