ETV Bharat / city

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వామపక్షాల 'ఛలో విజయవాడ'

author img

By

Published : Dec 13, 2019, 7:04 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నేతలు 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. డిసెంబర్​ 23న కార్మిక సంఘాలతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వామపక్షాల 'ఛలో విజయవాడ'
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వామపక్షాల 'ఛలో విజయవాడ'

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వామపక్షాల 'ఛలో విజయవాడ'

పోస్కో సంస్థ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనుకుంటే విశాఖలో కాకుండా కడపలో ఏర్పాటు చేసేలా సీఎం జగన్ చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సంస్థకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వామపక్షాలు 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది తమ భూములను త్యాగం చేసిన ఫలితమే విశాఖ ఉక్కు కర్మాగారమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 23న కార్మిక సంఘాలతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

Intro:AP_VJA_17_13_STEEL_PLANT_MAHAA_DHARNA_AVB_AP10050 Etv Contributor : Satish Babu, Vijayawada Phone : 9700505745 ( )పోస్కో సంస్థ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనుకుంటే విశాఖలో కాకుండా కడపలో ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు.కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సంస్థకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చలో విజయవాడ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సంస్థకు అప్పగించే అంశంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరిపి తీర్మానం చేయాలని... అధికార విపక్ష పార్టీలు తమ అభిప్రాయాలను స్పష్టం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వేలాది మంది తమ భూములను త్యాగం చేసిన ఫలితమే విశాఖ ఉక్కు కర్మాగారమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. డిసెంబర్ 23వ తేదీన విశాఖ లో కార్మిక సంఘాలతో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఉక్కు కర్మాగారం కర్మాగారం కోసం నాడు భూములు ఇచ్చిన నిర్వాసితులు వేలాదిగా విశాఖ నుండి విజయవాడకు చలో అసెంబ్లీ కార్యక్రమంలో బైకులపై చేరుకుని ధర్నాచౌక్లో నిరసనలో పాల్గొన్నారు. బైట్...రామకృష్ణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వాసితుల నిరుద్యోగుల సంఘం నాయకుడు నరసింహారావు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు


Body:AP_VJA_17_13_STEEL_PLANT_MAHAA_DHARNA_AVB_AP10050


Conclusion:AP_VJA_17_13_STEEL_PLANT_MAHAA_DHARNA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.