ETV Bharat / city

తెదేపా అధికారంలోకి వస్తే రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది: గోరంట్ల

author img

By

Published : May 30, 2021, 6:13 PM IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్​కు కేంద్రం భారతరత్న ఇవ్వకుండా అన్యాయం చేసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు.

TDP polit bureau member gorantla buchaiah chowdary
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి

కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడుకు మద్దతిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామి అవుతుందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్​లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడులో గోరంట్ల పాల్గొన్నారు. తెలుగు జాతి కోసం, రాష్ట్రం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియడారు. ఆంధ్రుల అన్న అయిన ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఉపాధి కల్పనకు ఆంధ్రప్రదేశ్​ కేంద్ర బిందువు అవుతుందని ఆశించామని, కానీ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.2.50లక్షలు అప్పు మిగిల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం: బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.