ETV Bharat / city

ఎంపీ గోరంట్ల మాధవ్​ను.. కాపాడాలనేదే ప్రభుత్వ ఉద్దేశం

author img

By

Published : Aug 11, 2022, 3:10 PM IST

tdp leaders varla and anitha
tdp leaders varla and anitha

TDP leaders on YSRCP.. నగ్న వీడియోలో కనిపించిన వ్యక్తి వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నది వాస్తవమే కదా అని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. ఎస్పీ ఫక్కీరప్ప వీడియో చూశారా అని వర్ల ప్రశ్నించారు. చెడ్డ పని చేసిన వారిని ప్రశ్నించాల్సింది పోయి సమర్థిస్తారా? అని నిలదీశారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఫోన్‌ పరిశీలిస్తే అన్నీ విషయాలు తెలుస్తాయని సూచించారు.

TDP leader Varla Ramaiah.. దేశ పార్లమెంట్ చరిత్రలో వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ తరహాలో నగ్నవీడియో బయటకు రాలేదని.. దీనిపై లోక్​సభ స్పీకర్ తక్షణమే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. 75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో.. మాధవ్ జాతీయ జెండా ఎగురవేసేందుకు కూడా అనర్హుడని ధ్వజమెత్తారు. ఓ ఎంపీకి అండగా జిల్లా ఎస్పీ నిలబడితే.. ఇక మహిళలు తమ బాధ పోలీసులకెలా చెప్పుకుంటారని నిలదీశారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప.. గోరంట్ల మాధవ్ ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. మాధవ్ ఫోన్​లో వీడియో కాల్స్ డేటా పరిశీలిస్తే ఏయే నెంబర్లకు కాల్స్ వెళ్లాయో ఆ మాత్రం తెలియదా అని మండిపడ్డారు. వికృత చర్యలకు పాల్పడిన ఎంపీని ఓ ఐపీఎస్ అధికారి వెనకేసుకురావటం బాధాకరమని విమర్శించారు. అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలను ఇక దేవుడే కాపాడాలని.. ఫకీరప్ప చేసిన తప్పు తన సర్వీస్​లో ఓ మచ్చలా మిగిలిపోతుందని దుయ్యబట్టారు. రెండు కులాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు సైతం పోలీసులకు నేరంగా కనిపించలేదా అని ధ్వజమెత్తారు. తప్పు చేసిన ఎంపీని కాపాడేందుకు పోలీసు వ్యవస్థ చేతులెత్తేసి ప్రవర్తిస్తే ఇక ప్రజలకేం న్యాయం జరుగుతుందని మండిపడ్డారు.

TDP leader Anitha.. ఎంపీ గోరంట్ల మాధవ్​ను ఎలాగైనా కాపాడాలనేదే ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని.. తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థతో అసత్యాలు చెప్పించే పరిస్థితికి వచ్చారన్నారు. ఇప్పటివరకు గోరంట్ల మాధవ్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. ఎలాగూ అసలు వీడియో రాదనేది ఎస్పీ ఫకీరప్ప మాటల్లో తేలిపోయిందన్నారు. రాష్ట్ర పోలీసులు ఈ విషయంలో ఏమీ చేయలేరన్న స్పష్టమైందన్న అనిత.. కేంద్రం జోక్యం చేసుకొని ఎంపీ మాధవ్ వీడియో విషయంలో నిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.