ETV Bharat / city

TDP: జగన్ చేతకానితనం, అవినీతి వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం: తెదేపా

author img

By

Published : Oct 12, 2021, 8:46 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తెదేపా నేతలు(tdp leader comments on ycp) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి చేతకానితనం, అవినీతి వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని.. అక్రమ మాదకద్రవ్యాల వ్యవహారంలో త్వరలోనే పెద్ద తలకాయల బండారం బయటపడుతుందని అన్నారు.

TDP leaders fire on ycp govt
వైకాపాపై తెదేపా నేతల ఫైర్​

అక్రమ మాదకద్రవ్యాల వ్యవహారంపై ఎన్ఐఏ విచారణ పూర్తైతే రాష్ట్రంలో పెద్ద తలకాయల బండారం బయటపడుతుందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర(dhulipalli narendra on drugs case) తెలిపారు. "మాదకద్రవ్యాలపై ఎన్ఐఏ బృందం విజయవాడలోనూ తనిఖీలు నిర్వహిస్తే.. రాష్ట్రానికి కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చిందంటూ జగన్ రెడ్డి ప్రభుత్వం బ్లూ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తోంది. ఈ గోబెల్స్ ప్రచారంతో తాత్కాలికంగా సంతృప్తి చెందవచ్చు కానీ నిజాలన్నీ త్వరలోనే బయటకొస్తాయి. ఈ మాఫియా వెనుక ఎంతటివారున్నా ఎన్ఐఏ నిస్వార్థంగా పనిచేయాలి. విజయవాడ ఆశీ ట్రేడింగ్ సంస్థ పేరుతో పట్టుబడిన రూ.21వేల కోట్ల హెరాయిన్ పై ఎలాంటి విచారణ లేకుండానే పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఆశీ ట్రేడింగ్ కంపెనీ గత ఏడాది కాలంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు జీఎస్టీ చెల్లింపులు సమర్పించింది. ఇదే సంస్థ పేరుతో జూన్ నెలలో రూ. 1.75లక్షల కోట్ల హెరాయిన్ దిగుమతి అయినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన డ్రగ్స్ మాఫియా కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదు" అని ఓ ప్రకటనలో హెచ్చరించారు.

జగన్ రెడ్డి చేతకానితనం, అవినీతి వల్లే విద్యుత్ సంక్షోభం: మోకా ఆనంద్ సాగర్

జగన్ రెడ్డి చేతకానితనం, అవినీతి వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని తెదేపా అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్(moka anand sagar fire on cm jagan) ఆరోపించారు. "తెదేపా ప్రభుత్వం యూనిట్ విద్యుత్​ను రూ.6కు కొనుగోలు చేయడంపై ప్రతిపక్షనేతగా దుష్ప్రచారం చేసిన జగన్ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా రూ.20కి కొంటున్నామని కేంద్రానికి లేఖ రాశారు. అధికారంలోకి రాకముందు జనానికి ముద్దులు, ఆలింగనాలు ఇచ్చి.. ఇప్పుడేమో విద్యుత్ ఛార్జీలతో బాదుతున్నారు. ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దుచేయాలి" అని డిమాండ్ చేశారు.

పోస్టుల భర్తీపై జగన్​ది కప్పదాటు వైఖరి: పిల్లిమాణిక్యరావు

పోలీసు పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి జగన్ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు(pilli Manikya Rao on police job notifications) దుయ్యబట్టారు. గత రెండున్నరేళ్లలో నిరుద్యోగుల్ని నిలువునా ముంచారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 6500 పోలీసు పోస్టుల విడుదలకు ఇచ్చిన హామీని 29నెలలైనా అమలు చేయలేదని విమర్శించారు. సెప్టెంబర్​లోనే ఆ పోస్టులను భర్తీ చేస్తానన్న జగన్ రెడ్డి.. అక్టోబర్ వచ్చినా ఇంతవరకూ ఆ దిశగా ఆలోచన చేయలేదన్నారు. పోలీస్ ఉద్యోగాలపై ఎన్నో ఆశలుపెట్టుకున్న లక్షలాది నిరుద్యోగులు తమ భవిష్యత్​పై భరోసా కోల్పోతున్నారు. ఏడాదిగా పోలీసులకు కరవు భత్యం ఇవ్వకపోగా.. పోలీసు సంక్షేమం నిధుల్ని దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. సరెండర్ లీవ్స్ ఇంతవరకూ పడకపోగా వారంతపు సెలవుల్ని అమలు చేయట్లేదు. ఇప్పటికే చాలామంది పోలీసు అధికారులు.. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తడంతో వ్యవస్థ బలహీనపడుతోందని ఆయన మండిపడ్డారు.

పిటిషనర్​కు తెలియకుండానే కోర్టులో కేసులు: ఆలపాటి రాజా

ఇళ్ల నిర్మాణంపై పిటిషనర్​కు తెలియకుండా కోర్టులో కేసు వేసి న్యాయస్థానాన్ని వైకాపా ప్రభుత్వం మోసగించిందని మాజీమంత్రి ఆలపాటి రాజా(alapati raja on housing sites) ధ్వజమెత్తారు. విలేఖరుల సమావేశంలో పిటిషనర్ మాట్లాడిన ఓ వీడియోను ప్రదర్శించారు. 'తాను ఎలాంటి కేసులు వేయలేదు, ఇంటి మంజూరు కోసం తన వివరాలు, గుర్తింపు కార్డుల తీసుకున్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, తనకు తెలియకుండానే కేసు వేసినట్లు శివమురళి చెప్తున్న వీడియోనే ఇందుకు నిదర్శనం' అని అన్నారు. 30లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు పార్టీ నేతలతో కేసులు వేయించిందని ఆరోపించారు.

చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన 85వేల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా లబ్ధిదారులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన రూ.3,700కోట్లు, రూ.2వేలకోట్లను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 12లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేశామని చెప్తుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్ని పూర్తిచేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి..

Hetero IT Raids: ఆర్థిక ఉగ్రవాదం ఎక్కడుంటే..జగన్​ అక్కడ ఉంటారా ?: వర్ల రామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.