ETV Bharat / city

TDP leaders: వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేతల ఆగ్రహం

author img

By

Published : Oct 9, 2021, 10:54 PM IST

వైకాపా ప్రభుత్వ (YCP government) తీరుపై తెదేపా నేతలు(TDP leaders) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనతో రాష్ట్రం మత్తులో జోగుతోందని మండిపడ్డారు. హంగులు, ఆర్భాటాలు, రంగులు, ప్రకటనల కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఎయిడెడ్(aided) విద్యావ్యవస్థను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేతల ఆగ్రహం
వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేతల ఆగ్రహం

హంగులు, ఆర్భాటాలు, రంగులు, ప్రకటనల కోసం ప్రజల సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు(duvvarapu ramarao) విమర్శించారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.80వేల కోట్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.2,500కోట్లు బకాయిలు ఉన్న నరేగా బిల్లుల(narega bills)ను ప్రభుత్వం రూ.6,500కోట్లకు పెంచుకుందని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో పెంచిన వివిధ రకాల ఛార్జీలు, పన్నులపై ప్రజల పక్షాన పోరాడటానికి టీడీపీ సిద్ధమవుతోందని వెల్లడించారు.

ప్రజావేదిక కూల్చివేతతో వ్యవస్థల పతనానికి ప్రభుత్వం అంకురార్పణ చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్.రామకృష్ణ(AS.ramakrishna) ఆరోపించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే ఎయిడెడ్ విద్యావ్యవస్థను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే దాదాపు 16 వేల మంది సిబ్బందిని తొలగించడం దారుణమని అన్నారు.

వైకాపా పాలనతో రాష్ట్రం మత్తులో జోగుతోందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు(gollapalli suryarao) అన్నారు. గుట్కా, ఖైనీ వ్యాపారం చేస్తున్న వారిపై నిఘా ఉంచి, అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్‌(demand) చేశారు. రూ.2 లక్షల కోట్లు విలువైన ప్రభుత్వ ఆస్తులను వైకాపా సర్కార్ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మూడుముక్కలాట ఆడుతూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తోందని దుయ్యబట్టారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.