ETV Bharat / city

మంత్రి కొడాలి నానిపై సమగ్ర విచారణ జరపండి: వర్ల

author img

By

Published : Mar 28, 2022, 3:38 PM IST

Varla Ramaiah letter to DGP: తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. రాష్ట్ర డీజీపికి లేఖ రాశారు. గుడివాడలో అక్రమ క్యాసినో నిర్వహించిన మంత్రి కొడాలి నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.

Varla Ramaiah letter to dgp
తెదేపా నేత వర్ల రామయ్య

గుడివాడలో అక్రమంగా క్యాసినో నిర్వహించిన మంత్రి కొడాలి నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ.. డీజీపీకీ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడ నియోజకవర్గాన్ని మంత్రి కొడాలి నాని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యేక చట్టం, రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై కొడాలి నాని, అతని అనుచరులు వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయన్నారు. అక్రమంగా క్యాసినో నిర్వహిస్తున్నట్లు అనేక సార్లు విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

2015లో లంకా విజయ్ మరణం వాస్తవానికి రైలు ప్రమాదంగా మార్చబడిన ఆత్మహత్య అని ఆరోపించారు. అడపా బాబ్జీ మృతికి కొడాలి నాని వేధింపులే కారణమని అందరూ అనుకుంటున్నారన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అక్రమ క్యాసినో నిర్వహణపై తీసుకున్న చర్యలతోపాటు నూజివీడు డీఎస్పీ నివేదికను కూడా బహిర్గతం చేయాలని వర్లరామయ్య డిమాండ్‌చేశారు.

ఇదీ చదవండి:

వారి మరణాలకు.. కొడాలి నానికి.. సంబంధం ఏంటి ? - వర్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.