ETV Bharat / city

lokesh on drugs: తాలిబన్ల డ్రగ్స్‌కు.. తాడేపల్లి భవంతికి ఉన్న లింకేంటి?: నారా లోకేశ్‌

author img

By

Published : Sep 26, 2021, 10:39 AM IST

ముఖ్యమంత్రి జగన్​.. లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఏపీని ఇప్పుడు ఏకంగా డ్రగ్స్(Lokesh on drugs) డెన్​గా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. అత్యున్నత వ్యవస్థల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన డీజీపీ మాత్రం జగన్ భక్తిలో మునిగితేలుతున్నారని ఆరోపించారు.

నారా లోకేశ్‌
నారా లోకేశ్‌

తాలిబన్ల డ్రగ్స్(Lokesh on drugs)​కు.. తాడేపల్లి ప్యాలస్​కు ఉన్న సంబంధమేంటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) నిలదీశారు. లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని జగన్ రెడ్డి ఏకంగా డ్రగ్స్(drugs) డెన్​గా మార్చేసారని మండిపడ్డారు. దేశంలో ఉన్న అత్యున్నత వ్యవస్థలన్ని రాష్ట్రంవైపు వేలు చూపిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని ఇతర రాష్ట్రాలను హెచ్చరిస్తుంటే డీజీపీ మాత్రం జగన్ భక్తిలో మునిగితేలుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ డాన్​ని కాపాడేందుకు ప్రయత్నాలు ఆపి రాష్ట్ర పరువు కాపాడేందుకు శ్రద్ధ చూపాలని సూచించారు. మరో వైపు 'WhoIsDrugDonInAP' అనే హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్త ట్రెండింగ్​లో నిలిచిందని నారా లోకేశ్​ అన్నారు.

  • తాలిబన్ల డ్రగ్స్ కి తాడేపల్లి ప్యాలస్ కి ఉన్న లింకేంటి? లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్ డెన్ గా మార్చేసారు @ysjagan.(1/2) #WhoIsDrugDonInAP pic.twitter.com/fPU8mMUaAc

    — Lokesh Nara (@naralokesh) September 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీచదవండి.

SBI ON OVER DRAFT: రూ.6,500 కోట్ల ఓడీకి ససేమిరా..సాధ్యం కాదన్న ఎస్‌బీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.