ETV Bharat / city

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : Mar 19, 2022, 11:11 AM IST

CBN letter to Nithin Gadkari: కృష్ణా జిల్లా బాపులపాడులోని వేలేరు అడ్డరోడ్డు జాతీయ రహదారిపై అండర్‌పాస్‌తో కూడిన పైవంతెన నిర్మించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఆయన లేఖ రాశారు. వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని కోరారు.

Chandrababu letter to union minister Nithin Gadkari to construct flyover with underpass
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు లేఖ

CBN letter to Nithin Gadkari: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు జాతీయ రహదారిపై అండర్‌పాస్‌తో కూడిన పైవంతెన, నందిగామ మండలం మునగచర్లవద్ద అండర్ పాస్‌ నిర్మించాలని.. తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి గడ్కరీకి ఆయన లేఖ రాశారు. జాతీయ రహదారిపై అండర్‌పాస్‌ లేకపోవడంతో స్థానిక రైతులు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో వివరించారు. స్థానిక ప్రజల విన్నపం మేరకు వీలైనంత త్వరగా నిర్మాణాలు చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి:

'అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తానని..నాలుగు గోడల మధ్య నుంచి సీఎం బయటకు రావటం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.