ETV Bharat / city

TDP Anitha on Chittor woman Case : రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయ్యింది -వంగలపూడి అనిత

author img

By

Published : Jan 25, 2022, 1:54 PM IST

TDP Anitha on Chittor woman Case : రాష్ట్రం అక్రమ నిర్బంధాలకు, కస్టోడియల్ వేధింపులకు, చిత్రహింసలకు కేంద్రంగా మారిందని తెదేపా మహిళా పార్టీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు.

TDP Anitha on Chittor woman Case
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయ్యింది -వంగలపూడి అనిత

TDP Anitha on Chittor woman Case : రాష్ట్రం అక్రమ నిర్బంధాలకు, కస్టోడియల్ వేధింపులకు, చిత్రహింసలకు కేంద్రంగా మారిందని తెదేపా మహిళా పార్టీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. చిత్తూరు దళిత మహిళ ఉమామహేశ్వరిని పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్​కు ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవయ్యిందని మండిపడ్డారు. చేయని దొంగతనాన్ని ఆమెపై వేసి రెండు రోజులపాటు స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశారని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు మానవ హక్కుల సూత్రాలను పూర్తిగా విస్మరించారని అనిత విమర్శించారు.

ఇదీ చదవండి : Marijuana gang : విశాఖలో గంజాయి ముఠా బీభత్సం..కారును వదిలి, చెరువులోకి దూకి..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.