ETV Bharat / city

additional loan for housing: పేదల ఇళ్లకు రూ.35 వేల అదనపు రుణం.. ప్రభుత్వం ఉత్తర్వులు!

author img

By

Published : Dec 20, 2021, 6:40 PM IST

additional loan for housing: "పేదలందరికీ ఇళ్లు పథకం" లబ్ధిదారులు.. బ్యాంకుల నుంచి రూ.35 వేలు అదనపు రుణం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణానికిగానూ.. ఈ వెసులుబాటు కల్పిస్తూ.. గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీచేశారు.

state government provides additional loan for housing
పేదల ఇళ్లకు రూ.35 వేలు అదనపు రుణం.. ప్రభుత్వం ఉత్తర్వులు

additional loan for housing: పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులు.. బ్యాంకుల నుంచి రూ.35 వేలు అదనపు రుణం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ రుణానికి..3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలని సూచించింది. 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణానికిగానూ.. ఈ వెసులుబాటు కల్పించింది.

ప్రతి గృహానికీ.. లక్షా 80 వేల రూపాయల చొప్పున వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకోసం మరో రూ.35 వేలను 3 శాతం వడ్డీతో తీసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి:

High court on solar power: సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ నుంచి.. విద్యుత్‌ కొనుగోలుపై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.