ETV Bharat / city

SCR GM ON RAINS: 'భారీ వర్షాల నేపథ్యంలో రైళ్ల నిర్వహణ, భద్రతపై దృష్టి సారించండి'

author img

By

Published : Sep 6, 2021, 8:12 PM IST

SCR GM ON RAINS
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్య

భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావారణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైళ్ల నిర్వహణ, భద్రతపై దృష్టి సారించాలని అధికారులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) జనరల్‌ మేనేజర్‌(GM శ్రీ గజానన్‌ మాల్య సూచించారు. ఎస్​సీఆర్ జోన్‌లోని వివిధ అంశాలపై సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం నుంచి సమీక్ష నిర్వహించారు.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైళ్ల నిర్వహణలో భద్రతా అంశాలపై దృష్టి సారించాలని అధికారులను దక్షిణ మధ్య రైల్వే(SCR) జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్య(gajanan mallya) ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. ట్రాకులపై వరద నీరు పారే అవకాశాలున్న ప్రదేశాలలో క్రమ తప్పకుండా విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో భద్రత, సరుకు రవాణా, రైళ్ల రవాణా సమయపాలన మొదలగు అంశాలపై సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం నుంచి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులు, ఆరు డివిజన్లు రైల్వై మేనేజర్లు (డీఆర్‌ఎమ్‌లు) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ట్రాక్‌ పనులు వేగవంతంగా చేయాలి
జోన్‌ పరిధిలో కొనసాగుతున్న నూతన రైల్వే లైన్లు, డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌, యార్డ్‌.. ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పన వంటి పనులపై జీఎం సమీక్షించారు. ట్రాక్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రాజెక్టు పనులను సమయానికి పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైళ్ల రవాణాలో ఆలస్యాన్ని నివారించి, కచ్చిత సమయానికి రైళ్లు నడిచేలా వేగ పరిమితి ఆంక్షలను వీలైనంతగా తగ్గించాలని సూచించారు.

ఆ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి
ఆరోగ్య కేంద్రాలలో రోగులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గూడ్స్‌ షెడ్ల వద్ద సౌకర్యాలను అభివృద్ధి పరచాలన్నారు. జోన్‌లో భద్రతా తనిఖీల నిర్వహణపై జీఎం సమీక్షించారు. భద్రతా చర్యలపై నియమాలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆయన పునరుద్ఘాటించారు.

సరకు రవాణాలో వృద్ధి..
జోన్‌లో ఆగస్టు 2020లో జరిగిన సరుకు రవాణాతో పోలిస్తే.. 2021 ఆగస్టులో 51% అధికంగా సరకు రవాణా జరగడంపై అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. జోన్‌లో సరుకు రవాణా అభివృద్ధికి నూతన విధానాలను అన్వేషించేలా మరింత కృషి చేయాలని ఆయన అధికారులకు, సిబ్బందికి సూచించారు.

ఇదీ చదవండి..

TS RAIN ALLERT: 6-8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి: జీహెచ్​ఎంసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.