ఎస్సీ స్త్రీ శక్తి వార్షిక సదస్సును విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం ఎస్సీ స్త్రీల అభివృద్ధికై వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తామని ఎస్సీ స్త్రీ శక్తి సభ్యురాలు ఝాన్సీ అన్నారు. ఈసారి ఎస్సీ బాలికలకు మంచి విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. మంచి విద్యతోనే వెనుకబడిన వర్గాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు.