ETV Bharat / city

'బస్సులు ఏర్పాటు చేయండి... ఖర్చు భరిస్తాం'

author img

By

Published : May 17, 2020, 4:26 PM IST

వలస కార్మికుల బాగోగులపై ప్రభుత్వ ఆలోచనలు సరిగా లేవని.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్​ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతితో వలస ‌కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కోరారు.

sailajanath comments on  ysrcp governament
sailajanath comments on ysrcp governament

సరిహద్దులు దాటిస్తే వలస కార్మికుల సమస్య పరిష్కారం కాదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కేంద్రంతో మాట్లాడి రాష్ట్రాల్లోని వారిని స్వస్థలాలకు పంపించాలన్నారు. ఒకవేళ చేతకాకపోతే.. ఏపీ కాంగ్రెస్​కు మూడు రైళ్లు ఇవ్వాలని.. వలస కూలీలను తరలించేందుకు.. ఆ ఖర్చు తమ పార్టీనే పెడుతుందన్నారు. బస్సులను ఏర్పాటు చేయండి... తామే ఆ ఖర్చు భరిస్తాం... దారిపొడవునా షెల్టర్లు ఏర్పాటు చేయండి... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సేవ చేస్తారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: వలస కార్మికులకు అన్ని సదుపాయాలు సమకూర్చాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.