ETV Bharat / city

RTC Chairman Mallikarjuna Reddy: 'సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయం'

author img

By

Published : Aug 4, 2021, 5:45 PM IST

ఆర్టీసీ ఛైర్మన్
RTC Chairman Mallikarjuna Reddy

ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని ఆర్టీసీ ఛైర్మన్ ఎ.మల్లికార్జున రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో సంస్థను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.

ఆర్టీసీని లాభాల బాటలో పూర్తి స్థాయిలో కృషి చేస్తానని సంస్థ ఛైర్మన్ ఎ.మల్లికార్జున రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయవాడ లోని ఆర్టీసీ హౌస్ లో సంస్థ ఛైర్మన్ గా నేడు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

ఆర్టీసీని సీఎం ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేశారని మల్లికార్జునరెడ్డి చెప్పారు. ఉద్యోగుల భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉందని స్పష్టం చేశారు. ఛైర్మన్ గా ఆర్టీసీని అభివృద్ధి పధంలో నడిపిస్తానని విశ్వాసం వెలిబుచ్చారు. అధికారులను సమన్వయం చేసుకొని బాధ్యతలను నిర్వర్తిస్తానన్నారు.

ఇదీ చదవండి:

krishna board: రేపు రాయలసీమ ఎత్తిపోతల పర్యటనకు కృష్ణా బోర్డు బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.