ETV Bharat / city

విజయవాడ శివారులో చిరు దుకాణాల తొలగింపు

author img

By

Published : Aug 29, 2020, 6:16 PM IST

విజయవాడ నగర శివారులో ఏర్పాటు చేసిన బడ్డీకొట్లు, చిరు దుకాణాలను వీఎమ్​సీ అధికారులు శనివారం తొలగించారు. ఇటువంటి చర్యలకు మరోసారి పాల్పడితే కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు.

road side small shops were removed by vmc officers in vijayawada
నగర శివారులోని రోడ్లపై ఉన్న చిరుదుకాణాలు, బడ్డీ కొట్లు తొలగింపు

విజయవాడ నగర శివారులోని రాజీవ్​ నగర్​, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల ప్రధాన రహదారి వెంబడి అక్రమంగా ఏర్పాటు చేసిన చిరు దుకాణాలు, బడ్డీ కొట్లను వీఎమ్​సీ అధికారులు తొలగించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్​ శాఖ టౌన్​ ప్లానింగ్​ సూపర్​వైజర్​ మురళీ పర్యవేక్షణలో నిర్వహించారు. మరోసారి ఇలా రహదారుల వెంబడి ప్రభుత్వ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తే కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి :

దుకాణాలు తొలగించవద్దంటూ చిరు వ్యాపారుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.