ETV Bharat / city

'వచ్చే జూన్​లోగా 8 వేల కిలోమీటర్లు రోడ్లకు మరమ్మతులు పూర్తి చేస్తాం'

author img

By

Published : Mar 17, 2022, 10:29 PM IST

వచ్చే జూన్​లోగా రాష్ట్రంలో 8 వేల కిలోమీటర్లు రహదారుల మరమ్మతులు పూర్తి చేస్తామని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకర​నారాయణ తెలిపారు.

మంత్రి శంకర్​ నారాయణ
మంత్రి శంకర్​ నారాయణ

వచ్చే జూన్ నెలలోపు రాష్ట్రంలో 8 వేల కిలోమీటర్లు రహదారులకు మరమ్మతులు పూర్తి చేస్తామని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ తెలిపారు. రుణంగా తీసుకున్న రూ. 2 వేల 200 కోట్లును మరమ్మతుల కోసం ఖర్చు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.

మూడేళ్లలో 284 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను పూర్తి చేశామని.. 2వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం మరమ్మతుల కోసం 5 ఏళ్లలో పెట్టిన ఖర్చు కంటే ఎక్కువగా మూడేళ్లలోనే వైకాపా ఖర్చు చేసిందన్నారు. రూ.1158 కోట్లు నా బార్డు ద్వారా తీసుకొని 233 ప్లాన్ వర్కులను పూర్తి చేస్తామన్నారు.

ఇదీ చదవండి: చేనేత రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది: గవర్నర్ భిశ్వభూషణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.