ETV Bharat / city

Chalo Vijayawada: 'చలో విజయవాడ' యథాతథం: పీఆర్సీ సాధన సమితి

author img

By

Published : Feb 2, 2022, 4:15 PM IST

Updated : Feb 2, 2022, 5:32 PM IST

PRC Leaders on Chalo Vijayawada: విజయవాడ సీపీ కాంతిరాణా టాటాతో పీఆర్సీ సాధన సమితి నేతల భేటీ ముగిసింది. చలో విజయవాడ.. రేపు యథావిధిగా జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.

PRC Leaders Meet To CP
విజయవాడ సీపీతో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ

యథావిధిగా రేపటి చలో విజయవాడ

PRC Sadhana Samithi Leaders Meet Vijayawada CP: విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాతో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం చలో విజయవాడ రేపు యథావిధిగా జరుగుతుందని సాధన సమితి నేతలు ప్రకటించారు. సీపీ ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లిన నేతలు.. చలో విజయవాడ కార్యక్రమంపై అనుమతి నిరాకరణ, ఇతర అంశాలపై సీపీతో చర్చించారు.

చలో విజయవాడపై పీఆర్సీ సాధన సమితి ప్రకటనతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేసి.. కార్యక్రమానికి వెళ్లొదని నోటీసులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. విజయవాడకు వెళ్లే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్​పోస్టులు ఏర్పాటు చేసి బస్సులు, కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

CM Review: ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసు పెంచాం: సీఎం జగన్​

Last Updated : Feb 2, 2022, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.