ETV Bharat / city

New Post: పంచాయతీరాజ్ శాఖలో కొత్త పోస్టు.. ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ

author img

By

Published : Oct 11, 2021, 6:57 PM IST

Updated : Oct 11, 2021, 7:57 PM IST

పంచాయతీరాజ్ శాఖలో రాష్ట్రస్థాయి కొత్త పోస్టు
పంచాయతీరాజ్ శాఖలో రాష్ట్రస్థాయి కొత్త పోస్టు

18:54 October 11

పంచాయతీరాజ్ శాఖలో కొత్త పోస్టు

పంచాయితీరాజ్ శాఖలో కొత్త పోస్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. డివిజన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ పేరుతో కొత్త పోస్టును ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎంపీడీవోల పదోన్నతులతో ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. శాఖాపరమైన పరీక్షల ద్వారా ఎంపీడీవోలకు పదోన్నతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని సర్వీసు నిబంధనల్లో సవరణ చేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. డివిజన్‌ డెవలప్‌మెంట్‌ అధికారి పోస్టును రాష్ట్రస్థాయి పోస్టుగా నిర్ధారిస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇదీ చదవండి

భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చు: ప్రభుత్వ సలహాదారు సజ్జల

Last Updated : Oct 11, 2021, 7:57 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.