ETV Bharat / city

Nara Lokesh: 'జ‌గ‌న్‌ రెండున్నరేళ్ల పాలనలో హిందూధ‌ర్మం మంట‌గ‌లిసింది'

author img

By

Published : Oct 24, 2021, 4:41 PM IST

nara lokesh
nara lokesh

శ్రీకాకుళం జిల్లా(srikakulam district) పాత‌ప‌ట్నంలో శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయ ప్రహరీతో పాటు సింహ‌ద్వారాన్ని కూల్చివేయ‌టంపై నారా లోకేశ్(nara lokesh) మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దల‌కు తెలిసి చేసిన విధ్వంస‌మేనని నారా లోకేశ్‌ విమర్శించారు. జ‌గ‌న్‌రెడ్డి రెండున్నరేళ్ల పాల‌న‌లో హిందూధ‌ర్మం మంట‌గ‌లిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్తరాంధ్రుల‌ ఆరాధ్యదైవమైన శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లోని పాత‌ప‌ట్నం శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రహరీతో పాటు, సింహ‌ద్వారాన్ని కూల్చివేయ‌టం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి రెండున్నరేళ్ల పాల‌న‌లో హిందూధ‌ర్మం మంట‌గ‌లిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం, రామ‌తీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగాయని ధ్వజమెత్తారు.

రోడ్ల విస్తర‌ణ ప‌నుల పేరుతో దేవాలయాలను కూల్చేయ‌డం చూస్తే.. హిందూ దేవాలయాల ప‌ట్ల ప్రభుత్వ పెద్దలకు ఎంత నిర్దయ‌ ఉందో అర్ధమవుతోందని నారా లోకేశ్ (nara lokesh) అన్నారు. ఆలయాల ధ్వంసంపై వైకాపా ఎమ్మెల్యేకు సమాచారమిచ్చినా... పట్టించుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దల‌కు తెలిసి చేసిన విధ్వంస‌మేనని నారా లోకేశ్‌(nara lokesh) విమర్శించారు.

  • ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్కళాంధ్రుల‌ ఆరాధ్యదైవం పాత‌ప‌ట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహరీతో పాటు, ముందు సింహ‌ద్వారాన్ని కూల్చివేయ‌డం దారుణం.(1/4)#JaganAgainstHindus pic.twitter.com/pZjlvTzbpk

    — Lokesh Nara (@naralokesh) October 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

EX MINISTER SOMIREDDY: 'హైకోర్టే నమ్మట్లే.. పోలీసు వ్యవస్థకు ఇక విలువేముంది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.