ETV Bharat / city

'న్యాక్​ ఉద్యోగులను రెగ్యులర్​ చేసే అంశాన్ని సీఎం జగన్​ దృష్టికి తీసుకెళ్తాం'

author img

By

Published : Jun 27, 2021, 10:52 PM IST

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్​ట్రక్షన్​(న్యాక్) సంస్థలోని ఉద్యోగులను రెగ్యులర్​ చేసే అంశాన్ని సీఎం​ దృష్టికి తీసుకెళ్తానని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్​లో జి. శంకరయ్య అధ్యక్షతన జరిగిన న్యాక్ ఉద్యోగుల ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు.

naac
naac

న్యాక్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్​ చేసే అంశం పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడలోని ప్రెస్​క్లబ్​లో జి. శంకరయ్య అధ్యక్షతన జరిగిన న్యాక్ ఉద్యోగుల ప్రథమ మహాసభలో గౌతమ్ రెడ్డి మాట్లాడారు.

వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు న్యాక్​ పరిధిని విస్తరించి, ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేస్తామన్నారని గుర్తు చేశారు. కానీ ఆయన మరణానంతరం వచ్చి ముఖ్యమంత్రులెవరూ ఈ సమస్య గురించి పట్టించుకోకపోవటం దారుణమన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్​ అధికారం చేపట్టిన తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనం కల్పించడంలో కృషి చేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి: YSR_BHIMA: వైఎస్సార్​ బీమా పథకంలో మార్పులు... జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.