ETV Bharat / city

అది మంకీపాక్స్​ కాదు... సాధారణ దద్దుర్లే..: వైద్యులు

author img

By

Published : Jul 17, 2022, 5:16 PM IST

Monkey Pox: విజయవాడలో మంకీ పాక్స్‌ అనే అనుమానంతో.. దుబాయ్​ నుంచి వచ్చిన ఓ చిన్నారి నమూనాలను అధికారులు పుణె వైరాలజీ ల్యాబ్​కు పింపించారు. బాలికకు వచ్చింది సాధారణ దద్దుర్లేనని.. వైద్యులు తేల్చారు. కాగా.. చిన్నారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

monkey pox report is negative for virus suspected baby girl in vijayawada
ఆ చిన్నారికి మంకీపాక్స్​ కాదు.. సాధారణ దద్దుర్లేనట

Monkey Pox: విజయవాడలో మంకీ పాక్స్‌ కేసు కలకలం స్పష్టించింది. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలో చిన్నారి శరీరంపై దద్దుర్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చిన్నారి నమూనాలను సేకరించిన అధికారులు.. పుణె ల్యాబ్‌కు పంపించారు. అనంతరం చిన్నారి కుటుంబాన్ని ఐసోలేషన్​కు తరలించారు.

అయితే.. చిన్నారికి అనారోగ్యం మంకీపాక్స్ కాదని నిర్ధరించారు. అధికారులు బాలిక నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. నెగటివ్​గా నిర్ధరణైంది. బాలిక కుటుంబం ఇతరులతో కాంటాక్టు కాలేదని ఆరోగ్యశాఖ కమిషనర్‌ తెలిపారు. ఉదయం విజయవాడలో చిన్నారి శరీరంపై కనిపించిన దద్దుర్లు కనిపించగా.. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా.. బాలికకు వచ్చింది సాధారణ దద్దుర్లేనని వైద్యులు తేల్చారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.