ETV Bharat / city

Jogi Ramesh: విజ్ఞాపనపత్రం ఇవ్వడానికే చంద్రబాబు ఇంటికి వెళ్లా: జోగి రమేష్

author img

By

Published : Sep 18, 2021, 11:42 AM IST

Updated : Sep 18, 2021, 2:00 PM IST

MLA Jogi Ramesh responds over attack on cbn house
విజ్ఞాపన పత్రం ఇవ్వడానికే చంద్రబాబు ఇంటికి వెళ్లా: జోగి రమేష్

11:36 September 18

నిరసన తెలిపే హక్కు కూడా లేదా?: జోగి రమేశ్

తెదేపా నేత అయ్యన్నపాత్రుడు(tdp leader ayyanapatrudu).. ముఖ్యమంత్రి జగన్(cm jagan)​ను అసభ్య పదజాలంతో దూషిస్తే నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. సీఎంను, మంత్రులను, మహిళా హోంమంత్రిని దూషించిన ఘటనపై.. చంద్రబాబు(tdp chief chandrababu)ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి.. అక్కడికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. తన వెంట తమ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారన్నారు.  

మాపై దాడి చేయించారు..

చంద్రబాబు తన నివాసంలో గూండాలు, రౌడీషీటర్లను పెట్టుకుని తనపై దాడి చేశారని అన్నారు. మాపై రాళ్లు రువ్వించి కారు అద్దాలు పగలగొట్టించారని ఆరోపణలు చేశారు. కారు దిగకముందే తన కారు అద్దాలు పగలగొట్టారని తెలిపారు.  

ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేందుకే ప్రయత్నాలు

ఓ సాధారణ పౌరుడిగా సీఎం జగన్​ను తిట్టడంపై సహించలేక నిరసన తెలపడానికి వెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరసన తెలిపితే తనను సైతం పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్​కు తీసుకువెళ్లారన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేందుకే.. చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని జోగి రమేష్ విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు వెళితే దండయాత్ర అంటున్నారని మండిపడ్డారు.  

చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే

అయ్యన్నపాత్రుడు మాట్లాడిన అసభ్య పదజాలంపై.. చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చంద్రబాబు పర్యటనల్లో నిరసన తెలియజేస్తూనే ఉంటామని మరోమారు హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. నిరసన ఘటన కేవలం ఆరంభం మాత్రమేనని తెలిపారు.  

వారు రాష్ట్రానికి విజిటర్స్ మాత్రమే..

చంద్రబాబు, లోకేశ్​లు ఏపీకి విజిటర్స్ మాత్రమేనని జోగి రమేష్ విమర్శించారు. అడ్రస్, డోర్ నెంబరు లేని నేతలు ఇక్కడ సవాళ్లు ఎలా చేస్తారని నిలదీశారు.

ఇదీ చదవండి: 

తెదేపా అధినేత ఇంటిపై దాడి యత్నం... కర్రలు, రాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులు

Last Updated :Sep 18, 2021, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.